Jayam serial: గంగని క్షమించేసిన రుద్ర.. పైడిరాజుని చూసేసాడుగా!
on Jul 26, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -14 లో......గంగ లేట్ గా నిద్ర పోతుంటే ఫస్ట్ డేనే డ్యూటీ కి లేట్ గా వెళ్తే ఎలా త్వరగా రెడీ అవ్వు అని గంగ వాళ్ల అమ్మ నిద్ర లేపుతుంది. త్వరగా లేచి ఇంట్లో పనులు చేసి సూపర్ మార్కెట్ కి బయలు దేర్తుంది. బస్సు లేట్ అవ్వడం.. ఇంకా ఆటో దొరకపోవడంతో గంగ సూపర్ మార్కెట్ లోకి లేట్ గా వెళ్తుంది. రుద్ర ఆల్రెడీ సూపర్ మార్కెట్ లో ఉంటాడు. ఎవరు లేట్ గా వచ్చిన లోపలికి రానివ్వొద్దని చెప్తాడు. దాంతో గంగ లేట్ గా రావడంతో తనని లోపలికి అనుమతించారు. అప్పుడే రుద్ర వాళ్ళ పెద్దనాన్న వచ్చి గంగని లోపలికి తీసుకొని వెళ్తాడు.
నువ్వు ఇక్కడే ఉండు.. నేను రుద్ర తో మాట్లాడుతానని వెళ్లి ఈ ఒక్కసారి గంగని వదిలేయ్ అని చెప్తాడు. రేపటి నుండి టైమ్ కి వస్తుందని అతను రుద్రని కన్విన్స్ చేస్తాడు. ఇక రేపటి నుండి త్వరగా రమ్మని గంగతో చెప్పి రుద్ర వాళ్ళ పెద్దనాన్న చెప్పి వెళ్ళిపోతాడు. మరొక వైపు గంగ వాళ్ల నాన్న పైడిరాజు పేకాట ఆడి అప్పు చేస్తాడు. నా కూతురు జాబ్ చేస్తుంది. మీ అప్పు తీరుస్తానని వాళ్ళతో చెప్తాడు.ఆ తర్వాత గంగ సూపర్ మార్కెట్ లో అన్ని పనులు ఫాస్ట్ గా చేస్తుంది. ఫస్ట్ డే అయిన చాలా ఫాస్ట్ గా చేస్తున్నావని అక్కడున్న వాళ్ళు అందరు అంటుంటారు. నేను అంతే అని గంగ అనగానే అంటే పని రాక్షసివి అన్నమాట అని ఒకావిడ అంటుంది. రాక్షసి అనగానే రుద్ర ఫోటోని భూతంలాగా గీసిన బొమ్మ గుర్తుచేసుకొని ఇప్పుడు గానీ అతను అది చుస్తే ఇంకేమైనా ఉందా అని కంగారుగా రుద్ర క్యాబిన్ వైపు పరుగెడుతుంది గంగ.
రుద్ర క్యాబిన్ లో ఉంటాడు. బొమ్మ గీసిన పేపర్ టేబుల్ పై ఉంటుంది. ఇప్పుడు ఎలా తీసుకొని రావాలని గంగ టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో సూపర్ మార్కెట్ దగ్గరున్న గంగ దగ్గరికి పైడిరాజు అప్పు ఇచ్చేవాళ్ళని తీసుకొని వచ్చి.. వాళ్లకు డబ్బు ఇవ్వమంటూ గొడవ చేస్తుంటే రుద్ర చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



