సంజనకి బిగ్ బాస్ సపోర్ట్.. ఇమ్మాన్యుయల్ కి అన్యాయం చేసిన మనీష్!
on Sep 12, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 తెలుగు మొదలై నాలుగు రోజులు పూర్తయింది. ఈ సీజన్ లో నిన్నటి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో అందరు సరదాగా మాట్లాడుకున్నారు. నామినేషన్ లో అందరు సంజనని టార్గెట్ చేసినట్టుగా అనిపించడంతో తను ఏడ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సంజనని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు బిగ్ బాస్. మిమ్మల్ని అందరు కార్నర్ చేసినట్లు అనిపిస్తుందా అని అడుగుతాడు. అవును బిగ్ బాస్ చాలా బాధగా ఉంది. ఎవరు బాధపడిన నేను వెళ్లి వాళ్ళని ఓదారుస్తాను కానీ అందరు నన్ను కార్నర్ చేసారని సంజన చెప్తుంది. నిన్ను అందరు కార్నర్ చేసినా నువ్వు ధైర్యంగా ఉన్నావ్.. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను అందుకే నీకు స్పెషల్ పవర్ ఇస్తున్నానని బిగ్ బాస్ చెప్పాడు.
కెప్టెన్సీ టాస్క్ కి ఉన్నవాళ్లలో ఒక అయిదుగురిని ఎంపిక చేసుకోమని బిగ్ బాస్ చెప్తాడు. ఓనర్స్ నుండి ఇద్దరు రెంటర్స్ నుండి ముగ్గురిని సెలక్ట్ చేస్తుంది సంజనా. డీమాన్ పవన్, హరీష్, ఇమ్మాన్యుయల్, శ్రష్టి వర్మ, ఇంకా నేను అని సంజన చెప్తుంది. నాకు నా ఫ్యామిలీ గురించి టెన్షన్ గా ఉంది వాళ్ళు బాగున్నారా అని ఆడుగగా బాగున్నారని బిగ్ బాస్ చెప్తాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి ఈ విషయం అందరికి చెప్పమని బిగ్ బాస్ చెప్తాడు. సంజన బయటకు వచ్చి తను సెలక్ట్ చేసిన వాళ్ళ పేర్లని చెప్తుంది. మమ్మల్ని ఎందుకు సెలక్ట్ చెయ్యలేదని శ్రీజ, రీతూ చౌదరి కలిసి సంజనాని క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ మిగతా కంటెస్టెంట్స్ కి సెలక్ట్ అయిన వాళ్ళు ఎంత మంది వాళ్ళకి మద్దతు పలికితే వాళ్ళు ప్రస్తుతం ఉన్న అయిదుగురి కంటెండర్స్ కి జోడిగా ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు.
.webp)
అలా సంజనకి శ్రీజ, హరీష్ కి పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కి భరణి, డీమాన్ పవన్ కి ప్రియ, శ్రష్టికి రాము జోడిగా ఎంపిక అవుతారు. ఆ తర్వాత రెంటర్స్ మరొకవైపు ఓనర్స్ కెప్టెన్ ఎన్నిక గురించి మాట్లాడుకుంటారు. రెంటర్స్ లో సంజన తప్ప మనం ఎవరైనా కెప్టెన్ కావాలని భరణి రెంటర్స్ వాళ్ళకి చెప్తాడు. టాస్క్ మొదలవుతుంది. టాస్క్ ఆడేది కంటెండర్స్ కాదు.. వాళ్ళ జోడీలు ఆడాలి. టాస్క్ మొదలై మొదట రౌండ్ కి ఇమ్మాన్యుయల్ జోడి అయిన భరణి ఎలిమినేట్ అవుతాడు. టాస్క్ కి సంచాలకుడిగా మనీష్ వ్యవహరిస్తాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



