Bigg boss 9 Telugu: నోరుజారిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఇమ్మాన్యుయల్, భరణి ఆడవాళ్ళంట!
on Sep 12, 2025

బిగ్ బాస్ సీజన్-9 మొదలైన నాలుగు రోజులైంది. కానీ ఒక్కో ఎపిసోడ్ ఒక్కో లెవెల్ గా సాగుతుంది. మాస్క్ మ్యాన్ హరీష్ నోరుకి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. తాజాగా రిలీజైన ప్రోమోలో మాస్క్ మ్యాన్ హరీష్ నోరు జారాడు.
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఇందులో సంజనాకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. తను సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్స్ గేమ్ ఆడారు. ఇక ఈ టాస్క్ కి మనీష్ సంఛాలక్ గా ఉన్నాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయల్ కి మనీష్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక నేటి ప్రోమోలో ప్రియ, పవన్ కళ్యాణ్ టాస్క్ నుండి అవుట్ అయ్యాక.. అన్ ఫెయిర్ గేమ్ అంటూ మాట్లాడారు. ఇక ఇమ్మాన్యుయల్ అయితే తనని హరీష్ బాడీ షేమింగ్ చేసాడంటూ భరణితో చెప్పుకున్నాడు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ , దమ్ము శ్రీజ ఇద్దరు మాట్లాడుకున్నారు. తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి .. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలనుకొని గేమ్ ఆడాననుకున్నాను.. ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశానని నాకు ఇప్పుడు అర్థమైందంటూ మాస్క్ మ్యాన్ హరీష్ అన్నాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు హరీష్ పై మండిపడుతున్నారు.
శనివారం నీకు ఉంటదిరా గుండోడా అని ఒకరు కామెంట్ చేయగా, కామనర్స్ మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడని ఒకరు కామెంట్ చేశారు. నాగ్ సర్ చేతిలో శనివారం గుండోడికి గట్టిగానే ఉంటదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా సంఛాలక్ మనీష్ ని, మాస్క్ మ్యాన్ హరీష్ ని తిడుతూ చాలా కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss 9 Telugu) లో ఓ సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఇంత నోరుజారి మాట్లాడటం ఇదే ఫస్ట్. వీకెండ్ లో నాగార్జున ఏం అంటాడో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



