టేస్టీ తేజ రెమ్యునరేషన్ ఎంతంటే!
on Dec 1, 2024

బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయి బయటకొచ్చాడు. ఈ సీజన్ ముగియడానికి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలేని పొంది అవినాష్ ఫినాలేకి చేరుకున్నాడు. (Tasty Teja)
ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ చివరల్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. దాదాపు 8 వారాల పాటు తేజ హౌజ్‌లో ఉన్నాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ ఎలిమినేట్ కావడంతో ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న చర్చ సాగుతోంది. టేస్టీ తేజ వారానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ సీజన్‌కు గాను తేజకు బిగ్‌బాస్ రూ.16 లక్షల పారితోషం తీసుకున్నట్లు సమాచారం.
తేజ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇక నేటి ఆదివారం ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేషన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



