Priyanka jain : తిరుపతిలో జరిగిన ఇష్యూ మీద క్లారిటీ ఇచ్చిన ప్రియాంక జైన్!
on Dec 1, 2024

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయినా బయట అయినా గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్. అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.
ప్రియాంక జైన్, శివ్ కలిసి తమ యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితం వీళ్ళు తిరుపతిలో చేసిన వ్లాగ్ వైరల్ అయ్యింది. ఆ వ్లాగ్ లో ఏం ఉందంటే.. ఓం నమో వెంకటేశాయ అని భక్తితో కొలవాల్సిన చోట.. వీళ్ల రీల్స్ పిచ్చి చూపించారు. మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడవ మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. దీన్ని.. తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్?? అంటూ ఇద్దరూ షాక్ అయిన ఫొటోలతో తంబ్ నెయిల్ పెట్టి.. యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. వీడియో చివర్లో చిరుత లేదు ఏం లేదు అంతా ఫ్రాంక్ అంటూ తమ పైత్యాన్ని మొత్తం చూపించింది ప్రియాంక జైన్. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఈ ప్రాంక్ వీడియో వ్యవహారం టీటీడీకి కూడా చేరింది. ఇటువంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ సభ్యులు చెప్పారు.
ఇక ఇప్పుడు తాజాగా దాని మీద క్లారటీ ఇస్తూ శివ్ తో కలిసి తమ యూట్యూబ్ ఛానెల్ లో తిరుపతిలో జరిగిన ఇష్యూ మీద మా క్లారిటీ అంటు వ్లాగ్ చేసింది. శివ్ మాట్లాడుతూ.. తిరుపతి అనేది పవిత్రమైన స్థలం.. నాకేమైనా బాధ అనిపించినా , లో అనిపించినా నేను తిరుపతి దేవస్థానానికి వెళ్తాను. అక్కడ ఫ్రాంక్ లాగా చేసాం.. ఎవరిని బాధపెట్టడానికి ఆ వీడియో చేయలేదు. అందరికి క్షమాపణలు తెలుపుతున్నాం.. అలా చేసి ఉండాల్సింది కాదు.. ఇంకెప్పుడు అలాంటి ఫ్రాంక్ చేయం .. మమ్మల్ని క్షమించండి అంటు శివ్, ప్రియాంక జైన్ ఇద్దరు ఆ వ్లాగ్ లో చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



