Prithvi Elimination: పృథ్వీ ఎలిమినేషన్ తో విష్ణుప్రియ ఎమోషనల్..
on Dec 1, 2024
.webp)
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి సండే ఫండే ఎపిసోడ్ లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్‌లో చివరిగా మిగిలి పోయిన పృథ్వీ విష్ణు యాక్షన్ రూమ్‌కి వచ్చేయండంటూ నాగార్జున చెప్పారు. ఇక ఇద్దరి ముందు రెండు అక్వేరియంలు ఉన్నాయి. వీటిలో ముందుగా నెం 1 అని రాసిన లిక్విడ్ వేయాలంటూ నాగ్ చెప్పారు. అది వెయ్యగానే అక్వేరియంలో వాటర్ ఎల్లో కలర్‌లోకి మారిపోయింది. తర్వాత నెం. 2 లిక్విడ్ వేయాలి.. అది వేశాక ఆ నీళ్లు రెడ్‌లోకి మారితే వాళ్లు ఎలిమినేట్ అంటూ నాగార్జున చెప్పగా.. పృథ్వీ వాటర్ రెడ్ కాగా విష్ణు అక్వేరియంలో నీళ్లు ఎల్లోగా ఉన్నాయి. దీంతో పృథ్వీ యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున ప్రకటించారు.
విష్ణుకి ఓ హగ్గు ఇచ్చి అక్కడి నుంచి పృథ్వీ బయటికొచ్చాడు. అందరికీ హగ్గు ఇచ్చి బైబై చెప్పాడు పృథ్వీ. అయితే నిఖిల్, నబీల్, ప్రేరణ హగ్గు ఇచ్చినప్పుడు పృథ్వీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక గేటు దగ్గరికి వెళ్లగానే విష్ణు మరోసారి పృథ్వీకి హగ్గు ఇచ్చి ఐయామ్ సారీ అంటూ చెవిలో చెప్పింది. పృథ్వీ వెళ్లిపోయిన తర్వాత ఏడుస్తూ ఐ మిస్ యూ.. యూ ఆర్ ఏ గ్రేట్ మ్యాన్.. పృథ్వీ అంటూ అరిచింది. స్టేజ్ మీదకి వచ్చీ రాగానే ఊహించావా ఎలిమినేషన్ గురించి అంటూ నాగార్జున అడిగారు. దీనికి లేదు సార్ కానీ ఐయామ్ ఫైన్.. నో రిగ్రెట్స్ అంటూ పృథ్వీ అన్నాడు. తర్వాత పృథ్వీ జర్నీ వీడియో ప్లే చేశారు నాగార్జున. ఇందులో పృథ్వీ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి జరిగిన ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అన్నీ కవర్ చేశారు. ముఖ్యంగా విష్ణుప్రియతో నడిచిన లవ్ ట్రాక్‌ని పాటలేసి మరీ గట్టిగానే ఎడిట్ చేశారు. అలానే సోనియా, యష్మీ, నిఖిల్, నబీల్‌లతో పృథ్వీ బాండింగ్‌ని బాగా చూపించారు.
జర్నీ వీడియోలో తన తండ్రి ఫొటో ఇదొక్కటే ఉందంటూ చెబుతున్న సీన్ చూసి పృథ్వీ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఫ్యామిలీ వీక్‌లో వాళ్ల అమ్మ గారు లోపలికి వచ్చినప్పుడు జరిగిన ఎమోషనల్ సన్నివేశాలకి పృథ్వీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పృథ్వీ ఏడవడం చూసి నాగ్ కూడా కాస్త అవాక్కయ్యారు. జనరల్‌గా హౌస్‌లో ఇప్పటివరకూ పృథ్వీ ఒకే ఒక్కసారి ఏడ్చాడు. అది కూడా మెగా చీఫ్ అవకాశం కోల్పోయినప్పుడు మాత్రమే. ఇలా పృథ్వీ జర్నీ బిగ్ బాస్ హౌస్ లో ముగిసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



