Brahmamudi : రుద్రాణి ప్లాన్ కి స్వరాజ్ బ్రేక్.. రేవతిపై ఆ నింద పడనుందా!
on Sep 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -822 లో.....రుద్రాణి తీర్థంలో ఏదో మందు కలుపుతుంది. అది అప్పు కావ్య తాగితే వాళ్ళ ప్రెగ్నెంట్ పోతుందని ప్లాన్ చేస్తుంది. రుద్రాణి అది కలిపి వెనక్కి తిరుగుతుంది. అక్కడ స్వరాజ్, కనకం ఉంటారు. వాళ్ళు చూసారేమోనని భయపడుతుంది.. కానీ వాళ్ళు చూడరు. నాకు జ్యూస్ తీసుకొని రమ్మన్నాను కదా ఇంకా తీసుకొని రావడం లేదేంటని రుద్రాణిని స్వరాజ్ అడుగుతాడు. నువ్వు ఇప్పుడు జ్యూస్ తీసుకొని రాకపోతే మా ఫ్రెండ్ కి చెప్తానని బెదిరిస్తాడు. దాంతో రుద్రాణి సరే అంటుంది.
ఆ తర్వాత వినాయకుడి పూజ జరుగుతుంది. తీర్థం పంతులు అందరికి ఇస్తాడు. కావ్యకి ఇవ్వబోతుంటే అప్పుడే స్వరాజ్ తీర్థానికి తాకుతాడు.. అది కిందపోతుంది. దాంతో స్వరాజ్ పై రుద్రాణి కోప్పడుతుంది. వేరొకరి ఇంటికి వచ్చినప్పుడు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని రేవతిపై కోప్పడుతుంది. బాబు ఏదో చూడకుండా చేసాడు. ఆ మాత్రం దానికే అంతలా అరవాలా అని రుద్రాణిపై అపర్ణ కోప్పడుతుంది. నువ్వు ఇప్పుడు స్వరాజ్ వాళ్ళ అమ్మకి సారీ చెప్పాలని అపర్ణ అనగానే రుద్రాణి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత కావ్య కిచెన్ లో ఉండగా.. రాజ్ వెనకాల నుండి వచ్చి ముద్దుపెడతాడు. ఏంటి ఇలా వచ్చారని కావ్య అడుగుతుంది. బెడ్ రూమ్ లో కొంచెం బ్యాలెన్స్ ఉండే కదా అని రాజ్ రొమాంటిక్ గా మాట్లాడతాడు. అప్పుడే ఇందిరాదేవి రావడంతో ఏదో కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో స్వరాజ్ వాళ్ళు ఎవరో కనిపెట్టాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. రేవతి బ్యాగ్ లో నగలు రుద్రాణి వేస్తుంది. అత్తయ్య నెక్లెస్ లేదని అపర్ణ దగ్గరికి కావ్య వస్తుంది. ఈ ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్ళ పని అయి ఉంటుందని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



