ENGLISH | TELUGU  
Home  » TV News

సౌజన్యరావుకి మెసేజ్ చేసే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు?

on Apr 14, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -736 లో.. రిషి, వసుధార ఇద్దరు ఆ బంధించబడిన గదిలో నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. రిషి గది మొత్తం చూస్తాడు.. ఏమైనా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుందేమోనని. అక్కడ ఒక కిటికీ తలుపులు తీసేస్తే వెళ్లిపోవడానికి మనిషి దూరేలా ఉంది వసుధార.. ఇదే మనకి మంచి ఛాన్స్ బయటపడడానికి అని రిషి అంటాడు. ఇక ఇద్దరు ఆ గదిలో నుండి బయటపడతారు. అక్కడే రౌడీలు కాపలా ఉండడంతో చాటుగా వారి కంటపడకుండా బయటకు వెళ్తారు. వసుధార రిషిలు బయటకు రావడంతోనే.. ప్రెస్ వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇక మనం అక్కడ నుండి బయటపడింది బెటర్ అయింది. లేకపోతే మనల్ని బ్యాడ్ చేసి కాలేజీ పరువు తియ్యాలని చూసారంటూ రిషి అంటాడు. వసుధార నడుస్తుండగా కాలికి మేకు గుచ్చుకుంటుంది. వసుధార ఏమైందంటూ ఆమె కాలిని పట్టుకొని.. తన కర్చీఫ్ ని కాలికి కడుతాడు రిషి. ఇక వసుధార నడవలేకపోవడంతో తనని ఎత్తుకొని తీసుకెళ్తాడు. కొద్దిదూరం నడిచాక ఆటో వస్తే ఆపి.. అందులో ఇద్దరు ఎక్కుతారు. ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకొని స్టేషన్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అదంతా ఎవరు చేశారో కనుక్కోమని చెప్తాడు రిషి.

మరోవైపు "రిషిని ఎవరు పట్టించుకోవట్లేదు.. కొందరు వచ్చాక రిషిలో మార్పు వచ్చింది.. పద్ధతులు చేంజ్ అయ్యాయి" అని దేవయని అనగానే.. నువ్వు రిషిని పెంచావేమో గాని జగతి తన తల్లి.. నువ్వు ఇంకొకసారి అలా మాట్లాడకు అని గట్టిగానే దేవయానికి వార్నింగ్ ఇస్తాడు ఫణింద్ర. అప్పుడే ఇంటి ముందు ఆటోలో నుండి రిషి, వసుధారలు దిగుతారు. వాళ్ళని చూసిన ఇంట్లో వాళ్ళు కంగారుపడి.. ఏమైందని అడుగుతారు. ఏమైంది రిషి మీరు ఆటోలో రావడమేంటని దేవయాని అంటుంది. వసుధార కాలు నొప్పిగా ఉన్నట్లు ఉంది లోపలికి తీసుకెళ్లండి మేడమ్ అని జగతితో చెప్తాడు రిషి. పెద్దమ్మ.. మేము కావాలనేం ఇంటికి లేట్ గా రాలేదు.. సమాజం ఏమనుకుంటారు వాళ్ళేం అనుకుంటారు అన్నారు కదా.. అలా అనడం నాకు నచ్చలేదు పెద్దమ్మ.. మీరు అన్నట్లు తప్పటడుగులు వేసేవాళ్ళు ఆలోచించాలి.. మేము కాదు మా హద్దులు.. మా పద్ధతులు మాకు ఉన్నాయని రిషి అంటాడు. పెద్దమ్మ మీరు లోపలికి వెళ్ళండి.. నేను డాడ్, పెద్ద నాన్నతో మాట్లాడాలని రిషి అనగానే.. నేను ఉండకూడదా అని దేవయాని అడుగుతుంది. ‌ అదేం కాదు పెద్దమ్మ కాలేజీకి సంబంధించిన విషయాలవి.. మీరు విని ఒత్తిడిగా ఫీల్ అవ్వడం ఎందుకని వెళ్ళమంటున్నాను అని రిషి అనగానే.. దేవయాని కోపంగా వెళ్ళిపోతుంది.

మరోవైపు సౌజన్యరావు "నా నుండి నువ్వు తప్పించుకోలేవు రిషేంద్ర భూషణ్" అని అనుకుంటాడు. ఇంతలోనే సౌజన్యరావుకి.. అప్డేట్ ఏంటని మెసేజ్ వస్తుంది. వాళ్ళు తప్పించుకున్నారని సౌజన్యరావు రిప్లై ఇస్తాడు. నో ప్రాబ్లెమ్ ప్లాన్  A ఫెయిల్ అయితే ప్లాన్ B అమలు చెయ్యండని అవతలి వ్యక్తి నుండి మళ్ళీ మెసేజ్ వస్తుంది. అసలు ప్లాన్ B ఏంటి? సౌజన్యరావుకి మెసేజ్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.