ENGLISH | TELUGU  
Home  » TV News

కొత్త అల్లుడిని మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కనకం!

on Apr 14, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -69 లో.. స్వప్నకి తన ఫ్రెండ్ ఇంట్లో అవమానం జరగడంతో రాహుల్ కి ఫోన్ చేస్తుంది. స్వప్న ఫోన్ చేస్తుందని రాహుల్ తిట్టుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేస్తున్నాడేంటి.. లాభం లేదు నేరుగా ఇంటికి వెళ్ళి తేల్చుకుంటాను.. ఇక ఈ అవమానాలన్ని భరించలేనని స్వప్న అనుకుంటుంది.

మరోవైపు అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లుడికి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకుంటారు కనకం ఫ్యామిలీ. అన్ని రకాల వంటలు చేస్తారు. మన ఇంటి ఛాయలకు కూడా రాడనుకున్న అల్లుడు.. నిన్ను తీసుకొని వచ్చాడని కనకం సంబరపడుతుంది. ఆడపిల్ల అత్తారింట్లో బాగుండాలంటే.. ఇలా అల్లుడు వచ్చినప్పుడు బాగా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మా అత్త మామలను నొప్పించకూడదని కూతురిని అత్తారింట్లో అల్లుడు బాగా చూసుకుంటాడు. అయినా ఒకసారి ఒకరి ఇంట్లో భోజనం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకొనే సంస్కృతి మనదని కృష్ణమూర్తి అంటాడు. ఇక రాజ్ ప్యాంటుపై అప్పు ఐస్ క్రీం పడెయ్యడంతో రాజ్ లుంగీ కట్టుకుంటాడు. లుంగీలో రాజ్ ని చూసి కావ్య షాక్ అవుతుంది. అన్ని వంటలు చూసి రాజ్ షాక్ అవుతాడు. కింద కూర్చోవాలా డైనింగ్ టేబుల్ లేదా అని రాజ్ అడుగుతాడు. లేదు బాబు అని మీనాక్షి అంటుంది. 

మరోవైపు అపర్ణ దగ్గరికి రుద్రాణి వెళ్ళి.. కావ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి లేనిపోనివి చెప్తుంది. ఇప్పుడే కావ్య చెప్పినట్లు రాజ్ వింటున్నాడని రుద్రాణి అనగానే.. నా కొడుక్కి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదని అపర్ణ అంటుంది. వాళ్ళ మర్యాదలతో రాజ్ ని వాళ్ళ వైపుకి తిప్పుకుంటారు. కావాలంటే నేను వీడియో కాల్ చేస్తున్నా చూడమని రాజ్ కి వీడియో కాల్ చేస్తుంది. అప్పుడు రాజ్ ఫోన్ కావ్య దగ్గర ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి రాజ్ తో పాటుగా, అతని ముందు ఉన్న వంటలు అన్ని చూపిస్తుంది కావ్య. రాజ్ ని లుంగీలో చూసి..  ఆ లుంగీ ఏంటి రాజ్ అని అడుగుతుంది. నేను తర్వాత చేస్తా మమ్మీ అని రాజ్ కట్ చేస్తాడు. ఆ తర్వాత అవి తినండి అల్లుడు గారు, ఇవి తినండంటూ మీనాక్షి, కనకంలు హడావిడి చేస్తారు.

మరోవైపు స్వప్న దుగ్గిరాల ఇంటి ముందుకు వస్తుంది. గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ స్వప్నని ఆపేస్తాడు. దాంతో రాహుల్ కి స్వప్న ఫోన్ చేసి.. మీ ఇంటి ముందే ఉన్నానని స్వప్న చెప్పగానే.. రాహుల్ బయటకు వచ్చి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.