ENGLISH | TELUGU  
Home  » TV News

ఏనుగులతో రిషి.. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయిన పోస్ట్!

on Apr 13, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో 'గుప్పెడంత మనసు' సీరియల్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్ లో రిషి, వసుధారల ప్రేమ కోసం చూసేవాళ్ళు చాలానే ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో అయితే రిషీధార , రిషీవసుధార ఫ్యాన్ అంటూ అకౌంట్స్ చాలానే ఉన్నాయి. దీన్నిబట్టి తెలుస్తోంది ఈ సీరియల్ ఇప్పుడు టీఆర్పీ లో ఎందుకు టాప్ లో ఉంది. గుప్పెడంత మనసు సీరియల్ నిన్న మొన్నటి దాకా వసుధార మెడలో వేసుకున్న తాళి గురించి కథ సాగగా.. ప్రస్తుతం కథలోకి కొత్త విలన్ వచ్చాడు. దీంతో ఈ సీరియల్ పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సీరియల్ లో ముఖేష్ గౌడ అలియాస్ రిషి అందరికి సుపరిచితమే. అయితే ముఖేష్ గౌడ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ సీరియల్ కి సంబంధించిన విషయాలను, తన వ్యక్తిగత సమాచారాన్ని ఇలా ప్రతీ అప్డేట్ ని షేర్ చేస్తుంటాడు. అయితే నిన్న మొన్నటిదాకా షూటింగ్ కి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయగా.. తాజాగా తను ఏనుగు మీద వెళ్తున్న వీడియోని పోస్ట్ చేసాడు. ఇందులో 'బాహుబలి' లోని ప్రభాస్ లా ఉన్నావ్ బ్రో, మరికొందరు సూపర్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏనుగుకి మేత తినిపిస్తూ, స్నానం చేపిస్తూ సేవ చేస్తున్న రిషి అలియాస్ ముఖేష్ గౌడని చూసి అతని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. "మనిషి ప్రకృతికి అతీతం కాదు, ప్రకృతిలో... ఏనుగులు అందమైన మనసున్నవి, అవి చాలా తెలివైనవి మరియు చాలా లాజికల్‌గా ఉంటాయి. మీరు ఏనుగును ఎప్పటికీ మరచిపోరు" అంటూ ముఖేష్ గౌడ ఈ పోస్ట్ కింద రాసుకొచ్చాడు. ఏనుగుకి సేవలు చేస్తూ జంతువుల పట్ల తనకున్న ఇష్టాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.