ఏవి అలనాటి ముద్దులు అంటున్న అర్జున్ కళ్యాణ్..శ్రీసత్య ఫీలవుద్ది అంటున్న నెటిజన్స్
on Jun 26, 2025
.webp)
అర్జున్ కళ్యాణ్ బుల్లితెర మీద బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత నువ్వుంటే నా జతగా అనే సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే మూవీస్, వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. "బాబు, ప్లే బ్యాక్, పెళ్లి కూతురు పార్టీ" వంటి మూవీస్ లో నటించగా, మిస్సమ్మ, నారి నారి నడుమ మురారి, 7 డేస్ ఆఫ్ లవ్ వంటి వెబ్ సిరీస్ లో కూడా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో, బిబి జోడిలో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు "ఏవి అలనాటి ముద్దులు" అనే మూవీలో నటించాడు. ఇప్పుడు ఈ మూవీ ఈటీవీ విన్ విన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.
ఆ మూవీ మేకింగ్ సీన్స్ ని కూడా పేజీలో పోస్ట్ చేసాడు. "ఈ మూవీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నాకు. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నటించడం మంచి విషయం అలాగే ఆయన నన్ను మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ నటాషా సింగ్ తో కలిసి నటించడం ఇంకా బాగుంది. రాంకీ కి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు" అంటూ పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే "మూవీ చాల బాగుంది, అమేజింగ్, రాఘవేంద్ర రావు గారితో పని చేయాలనీ ప్రతీ నటుడూ కోరుకుంటారు...యాక్టింగ్ చాలా బాగా చేశారు. కీప్ రాకింగ్. నీలో మ్యాటర్ ఉంది అన్నో...శ్రీసత్య ఫీల్ అవుద్ది బ్రో" అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ లవ్ ట్రాక్ తో వీళ్ళ మధ్య ఏదో ఉందని ఆడియన్స్ అంతా అనుకున్నారు కానీ ఏమీ లేదు అని అర్జున్ చెప్పాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి షోస్ లో కనిపించడం మానేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



