Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలక మలుపు.. తను ఏం చేయనున్నాడు!
on Dec 1, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -17 లో.....రామరాజు ముగ్గురు కొడుకులు మంచిగ రెడీ అయి ఫొటోస్ తీసి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోస్ ఇచ్చి.. పెళ్లి సంబంధం చూడమని చెప్తాడు రామరాజు. ఆ తర్వాత చందు, సాగర్, ధీరజ్ లు ఇంటికి వస్తారు. ముగ్గురు ఒకే డ్రెస్ లో ఉండడం చూసి ప్రేమ ఎగతాళి చేస్తుంది. దాంతో ప్రేమపై ధీరజ్ గొడవకి దిగుతాడు.
మరొకవైపు నర్మద టీ తాగుతుంటే.. తన పేరెంట్స్ కి పెళ్లివారు ఫోన్ చేసి ముహూర్తం ఖాయం చేసామని అనగానే.. నర్మద టెన్షన్ పడుతుంది. వెంటనే ఆ విషయం సాగర్ కి ఫోన్ చేసి కలవాలని చెప్తుంది. ఆ తర్వాత సాగర్ ని నర్మద కలిసి.. రేపు మీ వాళ్ళని తీసుకొని వచ్చి పెళ్లి గురించి మాట్లాడమని నర్మద చెప్పి వెళ్తుంది. దాంతో సాగర్ టెన్షన్ పడుతాడు. మరొకవైపు కళ్యాణ్ ని ప్రేమ కలుస్తుంది. కళ్యాణ్ ఎలాగైనా ప్రేమ దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలనుకుంటాడు. అందుకు ఎగ్జామ్స్ ఫీజు కట్టాలని బాధపడుతుంటే.. నేను ఇస్తానంటూ ఫీజు ఇస్తుంది. ఇక కళ్యాణ్ మాత్రం తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బెట్టింగ్ కి సిద్ధం చెయ్యండి అని అంటాడు.
ఆ తర్వాత సాగర్ ఆలోచిస్తుంటే.. ధీరజ్ ఏమైందని అడుగుతాడు. దాంతో నర్మద చెప్పింది చెప్పగానే ఆ విషయం నాన్నతో చెప్పమని అంటాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. నాన్న రేపు ఒకరి ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడలని సాగర్ అనగానే.. ఏంటి అంటూ రామరాజు కోప్పడతాడు. తరువాయి భాగంలో సాగర్, ధీరజ్, నర్మద వాళ్ళింటికి వెళ్తారు. వాళ్ళ నాన్నతో నర్మద, సాగర్ ల ప్రేమ విషయం ధీరజ్ చెప్తాడు. దాంతో నర్మద వాళ్ళ నాన్న రామరాజు దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



