నేను యాక్టర్ కాకపోయి ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాడిని
on Oct 3, 2025
.webp)
పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు పేరుతో ప్రసారమైన దసరా ఈవెంట్ అందరినీ అలరించింది. ఇందులో ఒక స్కిట్ చేశారు డ్రామా జూనియర్స్ లోని కొంతమంది పిల్లలు. ఆర్టిస్టులు కాకపోయి ఉంటే లైఫ్ లో ఇంకేం అయ్యేవాళ్ళు అంటూ.. అందులో ఒక కుర్రాడు ఆది పోస్టర్ వేసుకుని సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లా వచ్చాడు. ఒక చిన్నారి పూర్ణ పోస్టర్ వేసుకుని డాన్స్ టీచర్ ల వచ్చింది. ఇంకో కుర్రాడు రాంప్రసాద్ పోస్టర్ తో మెడికల్ షాప్ ఓనర్ లా వచ్చాడు. ఇంకో చిన్నారి సుహాసిని పోస్టర్ తో డాక్టర్ డ్రెస్ లో వచ్చింది. ఇక శ్రీముఖి ఒక్కొక్కరి ప్రొఫెషన్ గురించి అడిగి తెలుసుకుంది. "ఒకవేళా ఇలా యాక్టర్ కాకపోయి ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాళ్ళ" అని ఆదిని అడిగింది శ్రీముఖి.
"అవును నేను బిటెక్ కంప్లీట్ చేసి ఒక రెండు నెలలు ట్రై చేసాను. వాళ్లేమో ఒక చోటే కూర్చోమన్నారు. నాకేమో ఒక చోట కూర్చోవడం ఇష్టం లేదు. ఇక్కడంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. కానీ అక్కడా అలా ఏమీ మాట్లాడలేనుగా" అన్నాడు. "సుహాసిని నువ్వు యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేదానివన్నమాట ఇలాగా" అని శ్రీముఖి అనేసరికి "అవును నాకు ఇంజక్షన్ చేయడం అంటే ఇష్టం" అని చెప్పింది. తర్వాత ఎంబిబిఎస్ అంటే ఏంటి అని శ్రీముఖి అడిగేసరికి చెప్పలేకపోయింది సుహాసిని. "మిస్టర్ రాంప్రసాద్ మీరేంటి మెడికల్ షాప్ ఏంటి" అని శ్రీముఖి అడిగేసరికి "నేను ఇండస్ట్రీలోకి రాకముందు మెడికల్ లో ఉండేవాడిని ఒక షాప్ కూడా ఉంది నాకు., ఇక్కడ చేస్తూ అక్కడ షాప్ చూసుకునేవాడిని. ఇక్కడ బాగుండేసరికి అది వదిలేసి వచ్చాను. చాలామంది ప్రాణాలు కాపాడాను" అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



