నేనొక బ్యాట్స్ మెన్ ని... క్రికెటర్ ని అయ్యేవాడిని...
on Oct 3, 2025

ఒకప్పుడు తరుణ్ అంటే చాలు ముందుగా గుర్తొచ్చే సినిమా ఆదిత్య 369 . అమ్రిష్ పురి, బాలకృష్ణ వంటి లెజెండ్స్ తో చిన్న వయసులోనే నటించేసాడు. ఆ తర్వాత యంగ్ ఏజ్ లోకి వచ్చింది "నువ్వే కావాలి" మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఎన్నో మూవీస్ చేసాడు. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ గా దూరమైపోయాడు. ఇక ఇన్నాళ్లకు పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు షోకి వచ్చాడు. అలాగే పూర్ణ పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయింది. ఆమె కూడా ఈ షోకి వచ్చింది. ఐతే ఆమె ఒక విషయం అడిగింది. "తరుణ్ గారు యాక్టర్ కాకపోయి ఉంటే ఎం అయ్యేవారు" అంటూ అడిగింది పూర్ణ. శ్రీముఖి కూడా అడిగింది. "తరుణ్ గారు మీరు హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవారు అని పూర్ణ గారికి తెలుసుకోవాలని ఉంది" అని చెప్పింది. "అసలు హీరో అవ్వాలనే ఐడియానే లేదండి నాకు. నేను క్రికెటర్ ని అవుదామనుకున్నా. అనుకోకుండా ఈటీవీ వాళ్ళ ఉష కిరణ్ మూవీస్ నుంచి నువ్వే కావాలి మూవీ ఆఫర్ వచ్చింది.
దాంతో క్రికెట్ వదిలేసి హీరో అయ్యాను." అని చెప్పాడు తరుణ్. ఇక ఈ షోకి ఆదితో కలిసి జంటగా వచ్చిన సౌమ్య ఐతే "సర్ మీరు క్రికెటర్ ఐతే మీరు బౌలింగ్ చేయకుండా ముందే అన్ని వికెట్స్ వదిలేస్తారు" అని చెప్పేసరికి "లేదండి నేను బ్యాట్స్ మెన్ ని" అని చెప్పాడు తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తరుణ్ నటించిన చిన్నపిల్లలా మూవీ అంజలి అప్పట్లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీలో నటనకు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



