ఆర్టిస్ట్ ని కాకపోయి ఉంటే టిప్పర్ లారీ డ్రైవర్ ని అయ్యేవాడిని
on Oct 3, 2025
.webp)
దసరా సందర్భంగా ప్రసారమైన పిఠాపురం కమిటీ కుర్రోళ్ళు షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో శ్రీముఖి ఒక సెగ్మెంట్ పెట్టింది. అదేంటంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు ఈ ప్రొఫెషన్ లో కాకుండా వేరే ప్రొఫెషన్ లో ఉండి ఉంటే ఎలా ఉంటుంది అనే లైన్ తో డ్రామా జూనియర్స్ లో పిల్లలంతా వచ్చి ఒక స్కిట్ వేశారు. అందులో రిషి అనే కుర్రాడు అమరదీప్ పోస్టర్ ని మెడలో వేసుకొచ్చి ఫన్ చేసాడు. "హాయ్ నా పేరే అమరదీప్ టిప్పర్ లారీ అమరదీప్..ఈ టైర్ లు ఏంటి ఇంత మరకగా ఉన్నాయి. ఏంటో నా బతుక్కి నేనే ఓనర్ నేనే క్లీనర్" అని చెప్పి ఒక బొమ్మ టిప్పర్ లారీని తీసుకొచ్చాడు స్టేజి మీదకు. ఇక ఫైనల్ గా ఏంటి అమరదీప్ నువ్వు ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే టిప్పర్ లారీ తోలేవాడివా అంటూ శ్రీముఖి అడిగింది. "అవును బేసిక్ గా నాన్న ఆర్టీసీలో జాబ్ చేసేవారు. చిన్నప్పటినుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఫామిలీ పాస్ ఉండేది.
ఆ స్టీరింగ్ చూసి చూసి నేను కూడా డ్రైవర్ ని ఐపోతా అని ఒకరోజు చెప్పా. ఆ మాటకు మా అమ్మ నన్ను గట్టిగ కొట్టింది. లేదంటే లారీ డ్రైవర్ ని అవుదామనుకున్నాను." అని చెప్పాడు. డ్రైవర్ అవుదామనుకున్నావ్ అలా ఇప్పుడు సినిమా హీరో ఇపోయావ్ అంటూ శ్రీముఖి పొగిడేసింది. ఇక ఈ షోకి గెస్ట్ గా వచ్చిన పూర్ణ ఐతే రిషిని బుగ్గ కొరికింది. అమరదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద తనకంటూ ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే హీరో రవితేజ వీరాభిమాని. ఇక బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



