బుల్లెట్ భాస్కర్‌తో కుష్బూ క్యూట్ స్టెప్పులు.. వర్ష ముచ్చట్లు, ఇమ్ము ఇక్కట్లు!
on Nov 22, 2022

బుల్లితెర మీద కుష్బూ ఫుల్ ఫేమస్ ఐపోయింది. 'ఎక్స్ట్రా జబర్దస్త్'కి జడ్జిగా చేస్తోంది నిన్నటి అందాల తార కుష్బూ. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్‌తో ఆమె చిందేశారు. చాలా చిన్న చిన్న స్టెప్స్‌తో ఎంతో స్మార్ట్‌గా, ఎంతో హుషారుగా డాన్స్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్‌కు హైలెట్ అంటే కుష్బూ-బుల్లెట్ భాస్కర్ డ్యాన్స్ అనే చెప్పాలి. 'కాంచన' మూవీలోని "నలుపు నేరేడంటి కళ్లే" అనే పాటకు ఇద్దరూ కలిసి సూపర్‌గా స్టెప్పులేశారు.
ఇక వర్ష.. ఇమ్ముని వదిలేసి బులెట్ భాస్కర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఇలా ఇమ్ముతో తనకు గ్యాప్ వచ్చిందో లేదో భాస్కర్‌తో ముచ్చట్లు పెట్టింది వర్ష. రాబోయే ఎపిసోడ్‌లో భాస్కర్‌తో కలిసి 'వైఫ్ అండ్ హజ్బెండ్' స్కిట్ చేసింది వర్ష. ఈ స్కిట్ చూసి ఇమ్మూకి ఏడుపొక్కటే తక్కువ.
రానున్న ఎపిసోడ్‌లో గెటప్ శీను టీమ్ లో అన్నపూర్ణ వెరైటీ స్కిట్‌తో అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇందులో చేతబడి చేసే మాంత్రికుల గెటప్‌లో కనిపించారు ఆటో రాంప్రసాద్, అన్నపూర్ణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



