చంద్రబాబు ఇష్టమా, పవన్ కళ్యాణ్ ఇష్టమా ?
on Jul 30, 2025

సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి "సుందరకాండ" మూవీ టీమ్ రాబోతోంది. ఈ మూవీ టీమ్ లో నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వాసుకి, సునయన, విర్తి వాఘాని వీళ్లంతా వచ్చారు. ఐతే ఈ వీక్ సుమ అడ్డా కాస్తా పొలిటికల్ అడ్డాగా మారింది. ఇందులో కీలకమైన రాపిడ్ ఫైర్ రౌండ్ లో వాసుకుని, నారా రోహిత్ ని కొన్ని ప్రశ్నలు వేసింది సుమ. " మీరు రాఖీ పండగ రోజు రాఖీ ఎవరికీ కడతారు. మీ రియల్ బ్రదర్ కా లేదా తొలి ప్రేమలో మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి" అని అడిగేసరికి వాసుకి షాకైపోయింది. తర్వాత నారా రోహిత్ వచ్చారు. "మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు..చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు" అని అడిగింది సుమ.
పవన్ కళ్యాణ్ నటించిన ఎవర్ గ్రీన్ మూవీ తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ కి చెల్లిగా వాసుకి నటించింది. ఈ మూవీలో వీళ్లిద్దరి రోల్స్ మాత్రమే బాగా హైలైట్ అయ్యాయి. వాసుకి అంటే పవన్ కళ్యాణ్ సిస్టర్ గానే గుర్తిస్తారు ఆడియన్స్ కూడా. ఇక ఈ ప్రోమోలో నారా రోహిత్ కి పెళ్లి చూపులు చూస్తుంది అక్క సునయన. "అక్క ఇప్పుడు పెళ్లి చూపులు అవసరం..మగాళ్లకు సేఫ్టీ లేకుండా పోయింది. " అని పాపం బాధపడ్డాడు. దానికి సునయన "మాహా ఐతే పోయేదేముంది డ్యూడ్ ఒక ప్రాణమే కదా." అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక నారా రోహిత్ పెళ్లి చూపుల కోసం సుమ, శ్రీదేవి, విర్తి వచ్చి సాంగ్స్ పాడడం డాన్స్ లు చేయడం హైలైట్ గా ఉన్నాయి. ఇక వాసుకి, నారా రోహిత్ ఎం ఆన్సర్స్ ఇచ్చారో తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



