బిగ్ బాస్ టీమ్ పంపే మెయిల్స్ ని షేర్ చేయొద్దు....మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది
on Jul 30, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో కామన్ మ్యాన్ కేటగిరి నుంచి కొంతమంది తీసుకుంటున్నారు. వాళ్లకు టెస్టులు కూడా పెడుతున్నారు. ఇదంతా కూడా మెయిల్స్ ద్వారా జరుగుతోంది. ఐతే ఆది రెడ్డి ఈ విషయాన్నీ చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా చెప్పాడు. "రౌండ్ 3 గ్రూప్ డిస్కషన్ ఆగష్టు 3 న జరగబోతోంది.
మీరు నెక్స్ట్ రౌండ్స్ కి సెలెక్ట్ అయ్యారంటూ మీకు ఈమెయిల్స్ వస్తే గనక దయచేసి గుర్తుపెట్టుకోండి వాటిని ఎవరికీ షేర్ చేయకండి. ఎందుకంటే నాకు కొంతమంది అలాంటి మెయిల్స్ స్క్రీన్ షాట్స్ పెట్టారు. ఒక వేళా అలా మీ మెయిల్ లోని ఇన్ఫర్మేషన్ లీక్ ఐతే గనక అప్పుడు బిబి టీమ్ మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అది కూడా కాన్ఫిడెన్షియల్ మెసేజ్ ని లీక్ చేసిన బేసిస్ మీద మీరు సెలెక్ట్ ఐనా కానీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ టీమ్ లేటెస్ట్ అప్ డేట్స్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. డెబ్జనిని, జానూ లిరి, ఇమ్మానుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ ని, ఫోక్ డాన్సర్ నాగ దుర్గాని బిగ్ బాస్ టీమ్ అప్ప్రోచ్ ఐనట్టు తెలుస్తోంది. అలాగే ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఎక్స్ హౌస్ మేట్స్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



