ఫ్రెండ్స్ అయ్యాకే సిట్టింగ్ మొదలుపెట్టాం..
on Jul 30, 2025

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ ప్రోమో వచ్చింది. ఈ షోకి సింగర్స్ రఘు కుంచె, కల్పనా వచ్చారు. ఇక శ్రీముఖి ఐతే "మీరిద్దరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్" అని అడిగింది. "ఈ ఎపిసోడ్ కి రావడానికి" అని చెప్పింది కల్పనా. తర్వాత జబర్దస్త్ కమెడియన్ అభి పాటల రచయితా అనంత శ్రీరామ్ కలిసి ఈ షోకి ఫ్రెండ్స్ గా వచ్చారు. "ఒక హాస్య కళాకారుడికి ఒక పెన్ను కళాకారుడికి ఎలా కుదిరింది ఫ్రెండ్ షిప్" అని అడిగింది శ్రీముఖి. "2016 లో యూఎస్ ప్రోగ్రాం చేసాము." అని చెప్పాడు అభి. "ఎన్ని ట్రిప్పులు వేశారు లైఫ్ లో చెప్పండి" అని మళ్ళీ అడిగింది.
"మేమిద్దరం కలిసి ట్రిప్పులు వేస్తే ఏమొస్తుంది చెప్పండి." అన్నారు అనంత శ్రీరామ్ కామెడీగా. తర్వాత అమరదీప్ ఆరియానాతో కలిసి వచ్చాడు. "మీరిద్దరూ నిజంగానే సిట్టింగ్ లో ఫ్రెండ్స్ అయ్యారా" అని అడిగింది శ్రీముఖి. "ఫ్రెండ్స్ అయ్యాకే సిట్టింగ్ మొదలుపెట్టాం" అని చెప్పాడు అమరదీప్. తర్వాత టేస్టీ తేజ సోబాశెట్టితో కలిసి డాన్స్ చేసుకుంటూ మరీ వచ్చాడు. "వీళ్ళు రక్షా బంధన్ అనుకుని వచ్చినట్టున్నారు" అని కౌంటర్ వేసేసరికి తేజా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీముఖి "గర్ల్స్ హ్యాపీ ఫ్రెండ్ షిప్ చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటారో చెప్పండి" అనేసరికి విష్ణు ప్రియా పృద్వితో వచ్చింది. ఇక పృద్వి విష్ణుని ఎత్తుకుని డాన్స్ చేసాడు. దాంతో హరి "ఈ డాన్స్ జరుగుతున్నంత సేపు అమరదీప్ అనవసరంగా ఆరియానాతో వచ్చాను డెబ్జానీతో రావాల్సింది అనుకుంటూ ఉన్నాడు" అంటూ చెప్పాడు. "అమరదీప్ ఇక్కడ చూడు చాలామంది ఉన్నారు. కల్పనా అక్కతో డాన్స్ చేస్తావా" అంటూ శ్రీముఖి ఇంకా ఉడికించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



