మనసిచ్చి చూడు సీరియల్ హీరో పెళ్లి ఫిక్స్...
on Jul 24, 2025

"మా బోనాల జాతర" పేరుతో ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ రాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ మహేష్ - సాండ్రా. వీళ్ళ వీడింగ్ బెల్స్ ఈ స్టేజి మీద మోగాయి. మహేష్ "మనసిచ్చి చూడు" సీరియల్ లో ఆది రోల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇక ఈ ఎపిసోడ్ కి మహేష్ - సాండ్రా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. "మీకు అబ్బాయి నచ్చితే మహేష్ నా అల్లుడివి నువ్వే" అని చెప్పండి అంటూ సాండ్రా వాళ్ళ నాన్నకు చెప్పమని చెప్పింది శ్రీముఖి. "ఎప్పుడో చెప్పాను" అన్నారాయన..వెంటనే మహేష్ తనకు కాబోయే అమ్మాయి చేతులు పట్టుకుని ధర్మేచా..అంటే ధర్మంగా నిన్ను బాధ్యతగా చూసుకుంటాను అని ప్రమాణం చేస్తున్నా అంటూ వెలికి ఉంగరం తొడిగాడు. మోక్షేచ్చ అంటే మోక్ష మార్గంలో నడిపించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను అని చెప్పాడు. అప్పుడు సాండ్రా మహేష్ వెలికి ఉంగరం పెట్టింది. తర్వాత మహేష్ ఆమెను హగ్ చేసుకున్నాడు. "ఇప్పటివరకు నేను నీకు ప్రొపోజ్ చేయలేదు.
ఐ లవ్ యు" అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని చెప్పాడు. అలా ప్రొపోజ్ చేసిన తర్వాత మహేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దాంతో సాండ్రా అతని కన్నీళ్లు తుడిచింది. "మా ఇంటికి నాకు కాబోయే అమ్మాయిని తీసుకొచ్చా" అని చెప్పాడు. దాంతో శ్రీముఖి సూపర్ అంది. సెట్ లో ఉన్న వాళ్ళ ఫామిలీ మెంబర్స్ అంతా చప్పట్లు కొట్టారు. వీళ్ళిద్దరూ కలిసి "సమ ప్రయాణం" పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ ని రన్ చేస్తున్నారు. సాండ్రా జైచంద్రన్ ముద్దమందారం, కలవారి కోడళ్ళు వంటి సీరియల్స్ లో నటించింది. ఆటో విజయశాంతి సీరియల్ లో నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



