Illu illalu pillalu : భాగ్యం ఫ్యామిలీ గుట్టురట్టు చేసిన ప్రేమ, నర్మద.. శ్రీవల్లి షాక్!
on Jul 24, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -218 లో.... నర్మద ముందు సాగర్ వెళ్తు నర్మదని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దాంతో బావగారు నీతో మాట్లాడడం లేదు కదా ఎందుకు అక్కా అబద్దం చెప్పావ్.. నా వల్లే ఇదంతా అని ప్రేమ ఫీల్ అవుతుంది. నీతో కూడా ధీరజ్ మాట్లాడడం లేదు కదా నాకు అర్ధం అయింది.. వాళ్ళే మాట్లాడతారని ప్రేమతో నర్మద అంటుంది.
ఆ తర్వాత వేదవతి డల్ గా ఉంటుంది. తిరుపతి వెళ్లి మాట్లాడతాడు. తిరుపతి మాటలకి వేదవతి తన చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే నర్మద, ప్రేమ వస్తారు. నేను చెప్పినట్లు చెయ్యండి అని వాళ్ళు తిరుపతికి చెప్పి వేదవతి దగ్గరికి పంపిస్తారు. నీ పెత్తనం లాగేసుకున్నారు అక్కా.. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ వద్దు వెళదాం పద అని తిరుపతి అంటాడు. మమ్మల్ని విడదీయ్యాలి అనుకుంటావా అని వేదవతి మరొక చెంపపగులగొడుతుంది. అది మీ కోడళ్ళు చెప్పారని తిరుపతి అనగానే వేదవతి వాళ్ల వంక కోపంగా చూసి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ భోజనం తీసుకొని వస్తాడు. భోజనం చేయలేదట అని అడుగుతాడు. వస్తువుతో నీకెందుకని ప్రేమ బాధపడుతుంది.
మరొకవైపు ఇంటికి పెత్తనం వచ్చింది.. ఇక నేను చెప్పినట్లే వింటారని శ్రీవల్లి అనుకుంటుంది. పడుకున్న ప్రేమ దగ్గరికి వెళ్లి మొహంపై నీళ్లు చళ్లుతుంది శ్రీవల్లి. ఇది నీ పుట్టిల్లు కాదు రేపటి నుండి అయిదింటికి లేవాలని శ్రీవల్లి చెప్పగానే.. నేను లేవనని ప్రేమ అంటుంది. సరే ఇదే విషయం మావయ్య దగ్గరికి వెళ్లి చెప్తానని శ్రీవల్లి అంటుంది. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద కలిసి భాగ్యం ఫ్యామిలీ గుట్టురట్టు చేస్తారు. ఇడ్లీ అమ్మడానికి వెళ్తున్న భాగ్యం వాళ్ళ దగ్గరికి రామరాజుని ప్రేమ, నర్మద లు తీసుకొని వెళ్తారు. రామరాజు ఆనందరావుని కొడతాడు. ఆ తర్వాత ఆనందరావుని తీసుకొని వెళ్లి శ్రీవల్లి ముందు పడేస్తాడు రామరాజు. అది చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



