Brahmamudi : రుద్రాణి పెట్టిన చిచ్చు.. అపర్ణ తన కూతురిని అంగీకరిస్తుందా!
on Jul 25, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -782 లో... కావ్య, రాజ్ కలిసి యామిని ఇంటికి వస్తారు. ఇంటి పైనుండి యామిని, వైదేహి చూస్తుంటారు. కావ్య కావాలనే రాజ్ దగ్గరగా వచ్చి థాంక్స్ అని చెప్పి హగ్ చేసుకుంటుంది. మీరు రేవతి గారి విషయంలో హెల్ప్ చేస్తున్నందుకు థాంక్స్ అని కావ్య అనగానే రాజ్ ఇలా మీరు హగ్ ఇచ్చి థాంక్స్ చెప్తారని తెలిస్తే రోజొక హెల్ప్ చేసేవాడిని కదా అని రాజ్ అంటాడు. అదంతా యామిని చూసి కుళ్ళుకుంటుంది.
రాజ్ లోపలికి రాగానే.. మీరు ఆ కళావతి బాగా క్లోజ్ అయినట్లున్నారని వైదేహి అనగానే అదేం లేదండి.. రేపు కళావతి హ్యాపీగా ఉంటుంది.. అప్పుడు ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటున్నానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు కుడా సైలెంట్ గా ఉండాలా అని యామిని అంటుంటే ఉండాలి బేబి నువ్వు అప్పు విషయంలో తొందరపడ్డావ్. నువ్వు తప్పు చేసావనడానికి సాక్ష్యం వాళ్ల దగ్గర ఉందని వైదేహి అంటుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి రుద్రాణి వచ్చి.. ఇంకా రేవతిపై కోపం ఉందో లేదో టెస్ట్ చేస్తుంది. రేవతి పేరు తియ్యగానే అపర్ణ కొట్టినంత పని చేసింది.. ఇదే కదా మాక్కావాల్సింది ఆ రేవతి ఈ ఇంటికి దగ్గర కాకూడదని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. మరుసటి రోజు రాహుల్ తన పాపకి లో కాస్ట్ లో డ్రెస్ తీసుకొని వస్తాడు. ఎందుకు ఇలా తీసుకొని వచ్చావని రుద్రాణి అనగానే అప్పుడే కదా అందరికి తెలిసింది.. మా ఆస్తులు మాకు రాయండి అంటే పాప పేరు మీద అయినా ఆస్తులు రాస్తారు కదా అని రాహుల్ అంటాడు. అవునని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ కోసం కావ్య వెయిట్ చేస్తుంది. రాజ్ రాగానే పక్కకి తీసుకొని వెళ్లి రేవతి గారి అప్డేట్ ఏంటని కావ్య అడుగుతుంది. ఎప్పుడు దాని గురించేనా వస్తుంది లేండి అని కావ్యపై రాజ్ చిర్రు బుర్రులాడతాడు.
ఆ తర్వాత స్వప్న పాప పుట్టినరోజుకి కళ్యాణ్ ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి అప్పుకి చూపిస్తాడు. బాగుందని అప్పు అంటుంది. మనకి ఒక పాప ఉంటే బాగుండు అని కళ్యాణ్ అనగానే నాకు బాబు కావాలని అప్పు అంటుంది. అందరు స్వప్న దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



