జ్వరం వచ్చిన భవానికి ట్రీట్మెంట్ చేసిన కృష్ణ!
on May 3, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -146 లో.. ఈశ్వర్, ప్రసాద్ ల దృష్టిలో కృష్ణని బ్యాడ్ చేద్దామని ముకుంద ప్రయత్నించగా.. వాళ్ళేమో కృష్ణతో పాటు మురారిని కూడా తప్పుగా అనుకుంటారు. ఇదేంటి ఇలా అంటున్నారు.. వెంటనే డైవర్ట్ చేయాలని ముకుంద అనుకొని.. డాక్టర్ కి కాల్ చేశారా మామయ్య అని అడుగుతుంది.
భవాని, కృష్ణతో మాట్లాడకున్నా సరే తను ఒక జూనియర్ డాక్టర్ గా భవానికి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రసాద్ వేరే డాక్టర్ ని పిలిపిస్తాడు. వచ్చిన డాక్టర్ భవానిని చూసి.. ఆల్రెడీ ఈమెకు ట్రీట్మెంట్ చేసారు కదా.. ఒక సీనియర్ డాక్టర్ లాగా బాగా చేసారని.. మీరు ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కి థాంక్స్ చెప్పండని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణకి మురారి థాంక్స్ చెప్తాడు. ఎందుకని కృష్ణ అడిగితే.. మా పెద్దమ్మకి ట్రీట్మెంట్ ఇచ్చినందుకని మురారి అంటాడు. డాక్టర్ గా ఇది నా బాధ్యత అని కృష్ణ అంటుంది. బాధ్యతగా కాకుండా ప్రేమతో చేసానని చెప్పొచ్చు కదా కృష్ణ అని మురారి తన మనసులో అనుకుంటాడు. అయినా మీ పెద్దమ్మ మీతో మాట్లాడకపోతేనే ఏడ్చారు.. ఇక ఆరోగ్యం బాలేక అలా ఉంటే మీరు ఎంత బాధపడుతారో నాకు తెలుసు ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది.
నందు ఎలా ఉందోనని మురారి కృష్ణతో అంటాడు. ప్రేమ ఉంటే ఎంత దూరం అయినా వెళ్తారని నందుని చూస్తే అర్థమవుతుందని కృష్ణ అంటుంది. లవ్ మీద మీ అభిప్రాయమేంటటి? మీరు ఎవరినైనా ప్రేమించారా? బ్రేకప్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అని మురారిని అడుగుతుంది కృష్ణ. దాంతో ఎలాగైనా కవర్ చేయాలని మురారి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. మరొకవైపు భవానికి జ్వరం తగ్గి నీరసంగా ఉండటంతో హాల్లోనే కూర్చొని ఉంటుంది. అప్పుడు ముకుంద వచ్చి మీకు ట్రీట్మెంట్ చేసింది కృష్ణ అని చెప్తుంది. కృష్ణని పిలవమంటారా అత్తయ్యా.. మాట్లాడుతారా అని ముకుంద అనగానే.. లేదు తను ట్రీట్మెంట్ ఇస్తే ఎందుకు కోలుకున్నానా అని ఇప్పుడనిపిస్తుందని భవాని కోప్పడుతుంది.
మరొకవైపు మురారికి తల నొప్పిగా ఉండడంతో కృష్ణ టాబ్లెట్ తీసుకొచ్చి వేసుకోమని అంటుంది. తను వద్దంటాడు.. మీ తలనొప్పి ఎలా తగ్గించాలో.. నాకు తెలుసు.. మీ పెద్దమ్మకి కాల్ చెయ్యండని కృష్ణ అనగానే.. భవానికి మురారి ఫోన్ చేయడంతో.. తను కట్ చేస్తుంది. కట్ చేస్తుందంటే మీరు చేస్తున్నారని అర్థం అయింది కదా అని కృష్ణ అంటుంది. అలాగే మళ్ళీ చేయగానే మురారి నెంబర్ ని భవాని బ్లాక్ చేస్తుంది. దాంతో నెంబర్ బ్లాక్ చేసిందని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



