ENGLISH | TELUGU  
Home  » TV News

కొత్తింట్లోకి ఉదయభాను..పిల్లల స్కూల్ కి దగ్గరలోకి షిఫ్ట్

on May 3, 2023


ఉదయభాను ఒకప్పటి టాప్ యాంకర్స్ లో ఒకరు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే బుల్లితెరను ఏలిన యాంకర్స్ లో ఉదయభాను చాలా స్పెషల్. ఉదయభాను యాంకరింగ్ చేసిన షోస్  ‘సాహసం చేయరా డింభకా’, ఒన్స్ మోర్ ప్లీజ్, జాణవులే నెరజాణవులే అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. బుల్లితెర శ్రీదేవి అని ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకుని బుల్లితెరకి దూరమయ్యింది. మ్యారేజ్ లైఫ్ లో సెటిల్ ఐపోయింది. ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చి ఇంటి పనుల్లో బిజీ ఐపోయింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుండడంతో టీవీ షోస్ లో మళ్ళీ కనిపించడం స్టార్ట్ చేసింది ఉదయభాను. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే పేరు సంపాదించుకోవడానికి ట్రై చేస్తోంది.

ప్రెజంట్ ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది అందులోఇంటరెస్టింగ్  వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా తన హోమ్ టూర్ వీడియోని పోస్ట్ చేసింది. ఇంటి పనులు ఇంకా పూర్తి కాకపోయేసరికి సింపుల్ గా  భర్త పిల్లలతో కలిసి గృహప్రవేశం చేసేసింది  ఉదయభాను. తర్వాత ఇంట్లో పాలు పొంగించారు. ఇంకొద్ది  రోజులలో ఇంటి పనులు పూర్తవుతాయని  అప్పుడు పూర్తి వీడియో షేర్ చేస్తానని చెప్పింది. ఇప్పుడు తన హోమ్ టూర్లో  గెస్ట్ రూమ్, కిడ్స్ రూమ్, వారు చదువుకోవడానికి ఏర్పాటు చేసిన రూమ్,   హోమ్ థియేటర్,  బాల్కనీ ,టెర్రస్, కథక్ నేర్పిస్తే బాగుంటుంది అంటూ ఒక రూమ్ ని చూపించింది. గతంలో  హైటెక్ సిటీలో ఉండేవాళ్లమని ఐతే పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి అటు గంట ఇటు గంట జర్నీకే సరిపోతోంది అని వాళ్ళు స్ట్రైన్ అవుతున్నారంటూ   పిల్లల స్కూల్ కి దగ్గర్లో ఈ కొత్త ఇంటిని నిర్మించుకున్నట్లు చెప్పింది.  ఉదయభాను కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే అతన్ని ప్రేమించి  పెళ్లి చేసుకుంది. తర్వాత వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళే భూమి ఆరాధ్య, యూవీ నక్షత్ర. ఈ ఇద్దరు పిల్లలు చేసే వీడియోస్ ని కూడా యూట్యూబ్ ఛానల్ లో పెడుతూ ఉంటుంది ఉదయభాను.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.