రిషికి గోల్డ్ బ్రాస్లెట్ ని ప్రెజెంట్ చేసిన వసుధార.. అసూయతో శైలేంద్ర!
on May 3, 2023
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -752 లో... వసుధార జగతిలను కాలేజీ లోగోని ఆవిష్కరించండంటూ రిషి రిమోట్ ఇస్తాడు. రిషి సర్ మీరు కూడా చెయ్యండని వసుధార పట్టుపట్టడంతో.. ముగ్గురు కలిసి లోగోని ఆవిష్కరిస్తారు. అలా ఆవిష్కరించేప్పుడు జగతి చేయి పట్టుకుంటాడు రిషి. దాంతో జగతి ఎమోషనల్ అవుతుంది. నీ బలం వీళ్ళిద్దరే అన్న మాట.. నీ బలాన్ని లేకుండా చేస్తానని శైలేంద్ర అనుకుంటాడు.
అందరు వెళ్లిపోగా వసుధార మాత్రం రిషిని వెళ్ళకుండా ఆగమంటుంది. సర్ మీకు ఒకటి తెచ్చాను.. అది మీకు నచ్చుతుందో లేదో తెలియదు.. మీరు కళ్ళు మూసుకోండని చెప్పి.. గోల్డ్ బ్రాస్లెట్ ఇస్తుంది. అది చూసి రిషి హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగుంది వసుధార అని అంటాడు. ఆ తర్వాత పక్కనే కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీ దగ్గరికి శైలేంద్రని తీసుకెళ్లి చూపిస్తాడు రిషి. శైలేంద్రకి ఫోన్ పట్టుకోవడం ఇబ్బందిగా ఉండటంతో తన ఫోన్ రిషి పట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే శైలేంద్ర ఫోన్ కి సౌజన్యరావు కాల్ చేస్తాడు. రిషి చూసేలోపు శైలేంద్ర దాన్ని లాక్కుని.. బిజినెస్ కాల్ అంటూ పక్కకి వెళ్లి మాట్లాడుతాడు. రిషి ఎండలో ఉండడం చూడలేక గొడుగు తీసుకొని వచ్చి రిషికి పడుతుంది వసుధార. ఇది మీకు అంటూ శైలేంద్రకి ఇస్తుంది. ఒకరికొకరు బాగానే ఉన్నారు.. ఎన్ని రోజులు ఉంటారో చూస్తానని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత శైలేంద్రకి రిషి కాలేజీ అంతా తిప్పి చూపిస్తాడు. అన్నయ్య.. కాలేజీ ఎలా ఉందని అడగగానే.. చూడలేనంత బాగుందని కోపంగా శైలేంద్ర అనగానే.. అందరూ షాక్ అవుతారు.
ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి.. అంటే రెండు కళ్ళు చాలట్లేదని అంటున్నానని శైలేంద్ర కవర్ చేస్తాడు. డాడ్ కాలేజీ మొత్తం చూసాను.. మీ క్యాబిన్ ఎక్కడ కనిపించడం లేదని ఫణింద్రని శైలేంద్ర అడుగుతాడు. నాకు క్యాబిన్ లేదు.. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను అంతే కదా అని ఫణింద్ర అనగానే.. అందరికి క్యాబిన్ ఉంది.. చివరికి ఆ వసుధారకి కూడా ఉంది.. మీకు లేకపోవడమేంటని శైలేంద్ర అనేసరికి.. రిషితో పాటు అక్కడున్న మిగతా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయినా నాకు క్యాబిన్ కావాలంటే.. రిషి తన క్యాబిన్ ని ఇస్తాడని ఫణింద్ర అనగానే.. అవును పెద్దనాన్న అని రిషి అంటాడు. అన్నయ్య ఈ చైర్ లో కూర్చోండి అంటూ రిషి తన చైర్ లో శైలేంద్రని కూర్చొపెడతాడు. ఇలా చూస్తుంటే రాజులా ఉన్నావ్ అన్నయ్య అని రిషి అనగానే.. ఈ సామ్రాజ్యానికి రాజ్ ఒక్కడే.. అది నువ్వే శైలేంద్ర అంటాడు. త్వరలోనే ఎండీ గా శైలేంద్ర భూషణ్ అని పేరు మారుతుందని తన మనసులో అనుకుంటాడు శైలేంద్ర.
మరొకవైపు ఎప్పటిలాగా ధరణిని చీటికీ మాటికీ తిడుతూ.. టైం పాస్ చేస్తుంటుంది దేవయాని. ఆ తర్వాత శైలేంద్రని తీసుకెళ్ళి రిషి తన చైర్ లో కూర్చొబెట్టడం నచ్చని వసుధార.. రిషిని తన క్యాబిన్ కి తీసుకెళ్ళి తన చైర్ లో కూర్చోపెడుతుంది. దాంతో ఏంటీ వసుధార అని రిషి అడుగుతాడు. ఈ సీట్ లో మీరు మాత్రమే కూర్చోవాలి.. ఇది నా కోరిక అనుకోండి.. స్వార్థం అనుకోండని వసుధార అంటుంది. అన్నయ్య కూర్చున్నాడని ఫీల్ అయ్యావా అని రిషి అంటాడు. ఈ సీట్ లో కూర్చొనే అర్హత మీకు మాత్రమే ఉంది సర్ అని వసుధార అనగానే.. రిషి ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



