Karthika Deepam2 : దీపలా మాట్లాడిన సుమిత్ర.. ప్రాణధాతని కార్తీక్ చూపిస్తాడా!
on Sep 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -459 లో.. జ్యోత్స్నకి కొద్ది రోజులు టైమ్ ఇస్తాడు శివన్నారాయణ. ఈ లోపు రెస్టారెంట్ లాభాల్లోకి రాకపోతే సీఈఓని మార్చేస్తానని చెప్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నమ్మకం అనేది ఒకసారి పోతే ఇలాగే ఉంటుంది.. తర్వాత నమ్మకం కోసం ప్రయత్నం చేస్తే అది కలగదని జ్యోత్స్నతో సుమిత్ర చెప్తుంది. ఇదేంటే మమ్మీ అసలు దీపలాగా మాట్లాడుతుందని జ్యోత్స్న అనుకుంటుంది.
మరొకవైపు కిచెన్ లో ఉండి సుమిత్ర మాటలు వింటుంది దీప. అప్పడే దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. సుమిత్ర అత్త మాటలు విన్నావా.. అచ్చం నీలాగే మాట్లాడిందని కార్తీక్ అంటాడు. అవును కానీ అవి నాక్కూడా వర్తిస్తాయి. ఒకసారి నమ్మకం పోతే తిరిగి సంపాదించలేమని దీప అంటుంది. నిన్ను మీ అమ్మని కలుపుతానన్నాను కదా అని కార్తీక్ అంటాడు. ముందు మా అమ్మానాన్నని కలుపమని దీప అంటుంది. ఎప్పుడు అదేనా కొంచెం కాఫీ ఇవ్వమని కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్ పై దీప చిర్రుబుర్రలాడుతుంది. మరొకవైపు కాశీ యాక్సిడెంట్ చేశాడని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. నా భర్తని కాపాడండి అని శ్రీధర్ ని స్వప్న రిక్వెస్ట్ చేస్తుంది. మీరు చెయ్యరని కార్తీక్ కి ఫోన్ చేస్తుంటే తన ఫోన్ లాక్కొని స్వప్న, కావేరిలని లోపల ఉంచి శ్రీధర్ డోర్ పెడతాడు.
ఆ తర్వాత జ్యోత్స్నతో సుమిత్ర మాట్లాడుతుంది. నీకు ఒకసారి నచ్చితే ఎంతకైనా తెగిస్తావు.. చిన్నప్పుడు కలువ పువ్వు కోసం కార్తీక్ ని కోనేటిలో నెట్టావ్.. ఒక పాప వచ్చి కాపాడిందని పారిజాతంతో సుమిత్ర చెప్తుంటే అప్పుడే కార్తీక్ కూడా వస్తాడు. ఆ ప్రాణధాత లాకెట్ ఇంకా నా దగ్గర ఉందని కార్తీక్ చూపిస్తాడు. ఆ ప్రాణాధాత కన్పించింది మా వీధిలోనే ఉంటుంది అని కార్తీక్ అనగానే.. నేను తనని కలవాలని సుమిత్ర అంటుంది. ఆ అమ్మాయి వీళ్ళ వీధేనట.. అక్కడ వరకు వెళ్లి కాంచనని కలవకుంటే దశరథ్ తో మళ్ళీ లొల్లి అని పారిజాతం అంటుంది. ఇంకెప్పుడైన వెళదామని సుమిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బావ కళ్ళలో ఏదో కాన్ఫిడెన్స్ కన్పిస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



