Illu illalu pillalu : అమూల్యని ట్రాప్ చేయమని చెప్పిన భద్రవతి.. ప్రేమ దొరికిపోయిందిగా!
on Sep 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -260 లో..... రామరాజు, వేదవతిల చిన్నకూతురు అమూల్య ముగ్గురు కలిసి ఆరుబయట కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటారు. అదంతా భద్రవతి చూసి నా కుటుంబానికి సంతోషం లేకుండా చేసి నువ్వు సంతోషంగా ఉంటావా అని భద్రవతి బాధపడుతుంది.
అప్పుడే విశ్వ వస్తాడు. వాళ్ళని మనం ఏం చెయ్యలేము అత్త అంటాడు. నువ్వు ఆ రామరాజు చిన్నకూతురు అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లిచేసుకో... సంసారం చెయ్యడానికి కాదు.. తనని బాధపెట్టడానికి ఆ ధీరజ్ గాడు ప్రేమని ఎలా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. మనం అనుభవిస్తున్న బాధని వాళ్ళు అనుభవించాలని భద్రవతి అనగానే విశ్వ సరే అంటాడు. ఆ తర్వాత నర్మద, ప్రేమల విషయం రామరాజుకి చెప్పాలనుకుంటుంది శ్రీవల్లి కానీ సాక్ష్యం సంపాదించాక చెప్పాలని ఆగిపోతుంది.
ఆ తర్వాత ప్రేమ డల్ గా ఉంటే వేదవతి, నర్మద వచ్చి తను నవ్వేల ఏదో ఒకటి చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు నర్మదకి సాగర్ ముద్దు పెడుతుంటే శ్రీవల్లి వచ్చి నర్మద నీతో మాట్లాడాలని అంటుంది. సాగర్ వెళ్ళిపోతాడు. సాగర్ ఎగ్జామ్ రాసాడు కదా అని శ్రీవల్లి అనగానే నర్మద షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ వెంట ప్రేమ కర్ర పట్టుకొని పరిగెత్తుతున్న ఫోటో పేపర్ లో వస్తుంది. అది రామరాజుకి చూపిస్తుంది శ్రీవల్లి. ఏంటి ఇది అని ప్రేమని రామరాజు అడుగుతాడు. ప్రేమ వంక ధీరజ్ చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



