Karthika Deepam2 : జ్యోత్స్న, గౌతమ్ ల ఎంగేజ్ మెంట్ కోసం కార్తీక్ ఏర్పాట్లు.. అది కనిపెట్టేశాడుగా!
on Jul 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -406 లో.....కార్తీక్ ఎంగేజ్ మెంట్ రింగ్స్ తీసుకొని వచ్చి సుమిత్రకి ఇస్తాడు. ఇలా ఈ రింగ్స్ నీ చేత్తో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉందిరా అని సుమిత్ర అంటుంది. మీరేం కంగారు పడకండి పెళ్లి కూడా నా చేతుల మీదుగా జరుగుతుందని కార్తీక్ అంటాడు. మరొకవైపు ఈ గౌతమ్ గాడితో ఎంగేజ్ మెంట్ చెడగొట్టాలి అనుకుంటే వీడు ఏకంగా ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుంటున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఎలాగైనా వాడితో ఫోన్ లో మాట్లాడి ఎంగేజ్ మెంట్ కాన్సిల్ చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి రింగ్స్ పట్టుకొని వస్తుంది సుమిత్ర. మీ ఎంగేజ్ మెంట్ రింగ్స్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత గౌతమ్ తో ఫోన్ మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తుంటాడు కార్తీక్. ఏంటని శివన్నారాయణ అడుగుతాడు. జ్యోత్స్న రింగ్స్ పట్టుకొని ఉన్నప్పుడు వీడియో తీసి పంపామన్నాని అనగానే జ్యోత్స్నని పిలిచి రింగ్స్ తీసుకొని చూపిస్తూ వీడియో అంట పంపమని అంటాడు. రింగ్స్ లేవని జ్యోత్స్న అనగానే అందరు షాక్ అవుతారు. జ్యోత్స్న రింగ్స్ ని టెడ్డిబేర్ లో దాచింది గుర్తు చేసుకుంటుంది.
నేను గ్రానీకి ఇచ్చాను అనగానే పారిజాతం షాక్ అవుతుందిమ నాకు ఎక్కడ ఇచ్చావే అని పారిజాతం అనగానే నీకే ఇచ్చానని జ్యోత్స్న యాక్టింగ్ చేస్తుంది. దాంతో రింగ్స్ ఎక్కడ పెట్టవని శివన్నారాయణ పారిజాతం పై కోప్పడుతాడు. అప్పుడే దీప వచ్చి ఇదిగో రింగ్స్.. పారిజాతం గారు నాకు ఇచ్చారని దీప అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న దాచిన రింగ్స్ ని కార్తీక్ తీసింది గుర్తు చేసుకుంటాడు. రింగ్స్ ని సుమిత్రకి ఇస్తుంది దీప. సుమిత్ర అవి తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



