Ilu illalu pillalu : భాగ్యం భాగోతం నర్మద బయటపెట్డగలదా.. ప్రేమ టెన్షన్!
on Jul 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -207 లో.... భాగ్యంకి శ్రీవల్లి ఫోన్ చేసి నర్మద రెంట్ కి తీసుకున్న ఇంటి దగ్గరికి వెళ్లిన విషయం చెప్తుంది. నువ్వు ఏం కంగారు పడకు.. మీ మామయ్యకి ఒకవేళ విషయం చెప్పిన సాక్ష్యం కావాలని అంటాడు. ఆ సాక్ష్యాలు అది తీసుకొని రాలేదు.. ఇంత పెద్ద ఊళ్ళో మన ఇల్లు కనిపెట్టడం అసాధ్యమని శ్రీవల్లికి భాగ్యం దైర్యం చెప్తుంది.
ఆ తర్వాత భాగ్యం భర్త టెన్షన్ పడుతూ.. ఎందుకు ఆ నర్మదతో పెట్టుకున్నావ్.. ఏదో వార్నింగ్ ఇచ్చి వచ్చావ్.. ఇక ఆ పిల్లకి ఎలా ఉంటుంది.. మన భాగోతం మొత్తం బయట పెడుతుందకి భాగ్యంతో ఆమె భర్త అంటాడు. మరొకవైపు ప్రేమ, నర్మద ఇద్దరు భాగ్యం ఇంటి కోసం వెతుకుతుంటారు. అప్పుడే ప్రేమకి డాన్స్ క్లాస్ కి టైమ్ అయిందని ఫోన్ వస్తుంది. నాకూ అర్జెంట్ వర్క్ ఉందని ప్రేమ అక్కడ నుండి వెళ్తుంది. నా దగ్గర ప్రేమ ఏదైనా దాస్తుందా ఏంటని నర్మద అనుకుంటుంది.
ఆ తర్వాత ప్రేమ ఆటో కోసం చూస్తుంటే ధీరజ్ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. స్పెషల్ క్లాస్ ఉందని ప్రేమ అనగానే.. ధీరజ్ నమ్మడు.. అయితే సైకిల్ ఎక్కు అనీ ధీరజ్ అనగానే నేను ఎక్కనని ప్రేమ అంటుంది. దాంతో ప్రేమ వెనకాలే ధీరజ్ ఫాలో అవుతాడు. కానీ ధీరజ్ కి కనపడకుండా ప్రేమ వెళ్ళిపోతుంది. మరొకవైపు ధీరజ్ గురించి రామరాజు ఆలోచిస్తాడు. తరువాయి భాగంలో ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తుంటే.. అప్పుడే ప్రేమ వాళ్ళ నాన్న సేనాపతి చూస్తాడు. ప్రేమ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



