Brahmamudi : రాజ్ ప్రెజెంటేషన్ కి సిద్దార్థ్ ఫిధా.. కావ్యకి సపోర్ట్ గా అతను!
on Jul 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -770 లో..... రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. యామిని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా రాజ్ ని అందరి ముందు నీకు హెల్త్ బాలేదని విన్నాను నీకు ఎండీగా ఉండే కెపాసిటీ లేదని అంటాడు. ఇప్పటివరకు మన కంపెనీ డీలింగ్స్ చెప్పు.. ఎన్ని కోట్ల టర్నవోవర్ చేసిందని అడుగుతాడు. రాజ్ ఏం చెప్తాడోనని కావ్య టెన్షన్ పడుతుంది. కానీ రాజ్ ఆఫీస్ గురించి క్లారిటీ గా చెప్తుంటే అందరు షాక్ అవుతారు. రాజ్ కి గతం గుర్తు వచ్చిందేమోనని కావ్య అనుకుంటుంది.
రాజ్ మాట్లాడే మాటలకి సిద్దార్థ్ మైండ్ బ్లాంక్ అవుతుంది. సారీ రాజ్ మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నాను.. మీరే ఈ కంపెనీకి ఎండీ అని సిద్ధార్థ్ చెప్తాడు. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు వెళ్ళిపోయాక ఇప్పుడు నిజం చెప్పండి ఇవ్వన్నీ మీకెలా తెలుసు.. మీకు గతం గుర్తుకు వస్తుందా అని కావ్య అనగానే.. ఏం మాట్లాడుతున్నారు అండి మీరే అన్ని నేర్పించారు కదా అని రాజ్ అంటాడు. నేను చెప్పలేని విషయలు కూడా గుర్తున్నాయ్ అంటే గతం మెల్లగా గుర్తుకు వస్తుందని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు రాజ్ మీటింగ్ లో మాట్లాడింది. సుభాష్ కి తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లో అందరికి చెప్తాడు. దాంతో రాహుల్, రుద్రాణి డిస్సపాయింట్ అవుతారు. మరొక వైపు కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే అప్పుడే కావ్యకి యామిని ఫోన్ చేసి అప్పు సస్పెండ్ అయిన విషయం చెప్పగానే కావ్య రాజ్ ని హగ్ చేసుకొని ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది. తరువాయి భాగంలో అప్పు లంచం తీసుకుంటు దొరికిపోయిందని రుద్రాణి ఇంట్లో అందరికి చెప్తుంది. నా చెల్లి ఏం తప్పు చెయ్యలేదని నిరూపిస్తానని ధాన్యలక్ష్మికి చెప్తుంది కావ్య. ఆ తర్వాత రాజ్ కి అప్పు విషయం చెప్పగానే మనం ఇద్దరం కలిసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



