Karthika Deepam2 : దాస్ వల్ల ఆగిపోయిన ఎంగేజ్ మెంట్.. గౌతమ్ కి బుద్దిచెప్పిన కార్తీక్!
on Jul 25, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -418 లో..... జ్యోత్స్నకి గౌతమ్ రింగ్ తోడుగబోతుంటే.. ఎక్కడ ఎంగేజ్ మెంట్ జరుగుతుందేమనని టెన్షన్ పడుతుంది దీప. నువ్వు టెన్షన్ పడకు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఎంగేజ్ మెంట్ ఆపండి అని అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు.
నా మనవరాలు జీవితం నాశనం చేయాలని అనుకుంటావా అని గౌతమ్ కాలర్ పట్టుకుంటాడు శివన్నారాయణ. సాక్ష్యాలు లేకుండా ఇలా నింద వెయ్యడం కరెక్ట్ కాదని గౌతమ్ అంటుంటే.. దాస్ ని పిలవగా దాస్ వచ్చి గౌతమ్ రాసలీల వీడియో చూపిస్తాడు. అదంతా ఫేక్ అని గౌతమ్ సమర్ధిస్తుంటే.. తన వల్ల ప్రెగ్నెంట్ అయినా రమ్యని పిలుస్తారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు నువ్వే కదా గౌతమ్ కి నా కడుపులో బిడ్డకి సంబంధం లేదని చెప్పావని సుమిత్ర అంటుంది. అప్పుడు అబద్దం చెప్పానని రమ్య అంటుంది. ఇప్పుడు నిజం చెప్పావని గ్యారంటి ఏంటని గౌతమ్ అనగానే ఆ కడుపులో బిడ్డ కి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని దాస్ అనగానే గౌతమ్ భయపడుతాడు. ఈ పెళ్లి వద్దు ఏం వద్దని వెళ్తుంటే నిజం బయట పడింది కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతున్నావా అని అతడిని దశరథ్ కొడతాడు. నేనే చేసానా తప్పు.. నీ కూతురు కూడా చేసిందని.. దీపని చంపించాలని చూసిందని గౌతమ్ చెప్పబోతుంటే అతని చెంప చెల్లుమనిపిస్తాడు కార్తీక్. చేసింది తప్పు ఇంకా ఈ ఇంటి ఆడపిల్లపై వేలెత్తి చూపిస్తావా అని కార్తీక్ అంటాడు.
కాసేపటికి అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సుమిత్ర కళ్ళు తిరిగిపడిపోతుంది. డాక్టర్ వస్తారు. ఎంగేజ్ మెంట్ ఆగిపోవడంతో స్ట్రెస్ తీసుకున్నారని డాక్టర్ చెప్తుంది. కార్తీక్, దీపలని అక్కడ నుండి వెళ్ళమంటాడు శివన్నారాయణ. కార్తీక్ ఇంటికి వెళ్లి జరిగిందంతా కాంచనకి చెప్తాడు. ఆ తర్వాత దీప జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంటే.. కార్తీక్ వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత శౌర్య వచ్చి నాకు అమ్మ ఉంది.. నీకు అమ్మ ఉంది.. అమ్మ వాళ్ల అమ్మ ఎక్కడ అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



