Illu illalu pillalu : ఇంట్లో శ్రీవల్లిదే పెత్తనం.. ప్రేమ, నర్మదలకి టార్చర్!
on Jul 25, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -219 లో.....ప్రేమ నిద్రపోతుంటే శ్రీవల్లి వచ్చి మొహంపై వాటర్ కొడుతుంది. ఈ టైమ్ వరకు పడుకోవడమేంటి.. రేపటి నుండి ప్రొద్దున లేచి ముగ్గు పెట్టాలని శ్రీవల్లి అనగానే నేను చెయ్యనని ప్రేమ అంటుంది. అయితే ఈ విషయం మావయ్య గారికి చెప్తానని అనడంతో ప్రేమ కోపంగా వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత నర్మద స్నానానికి వెళ్తు గీజర్ స్విచ్ వేసుకొని వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే శ్రీవల్లి వచ్చి స్విచాఫ్ చేస్తుంది. నర్మద వచ్చి ఎవరు ఆఫ్ చేశారనుకుంటుంది నేనే అఫ్ చేసాను.. కరెంటు బిల్ ఆదా చేస్తున్నానని శ్రీవల్లి అంటుంది. ఇక నర్మద వెళ్లి ఛన్నీళ్లతో స్నానం చేస్తుంది. ఆ తర్వాత ప్రేమ ముగ్గు వేస్తుంది. నర్మద స్నానం చేసి వస్తుంది. అందరు నేను చెప్పినట్లు వింటున్నారని శ్రీవల్లి మురిసిపోతుంది.
ఆ తర్వాత శ్రీవల్లి పూజ చేసి హారతి ఇస్తుంది. మీ స్థానంలో నేను పెత్తనం చెయ్యడం బాధగా ఉంది కానీ మావయ్య గారికి ఎదురు చెప్పలేనని వేదవతితో శ్రీవల్లి అంటుంది. ఇక ఈ ఇంట్లో కొన్ని నిర్ణయలు తీసుకున్నానని అందరి ముందు శ్రీవల్లి చెప్తుంది. అందరు టైమ్ కి వెళ్లి టైమ్ కి రావాలి.. ఎవరైనా లేట్ గా వస్తే డోర్ తీయను అందరు నాకు చెప్పి వెళ్ళాలని చెప్తుంది. ప్రొద్దున అందరు శ్రీవల్లికి చెప్పి వెళ్తుంటారు. ప్రేమ నువ్వు ఎక్కడికి వెళ్లిన త్వరగా రావాలని శ్రీవల్లి చెప్తుంది. అందరూ చెప్పి వెళ్లడంతో శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



