Karthika Deepam2 : కార్తీక్ పై శివన్నారాయణకి డౌట్.. జ్యోత్స్నకి ఆ వీడియో పంపిన దీప!
on Jun 25, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -392 లో.....కార్తీక్ ఏదైనా అడుగు ఇస్తాను అన్నాను కానీ వాడేం అడగకుండా ఉన్నాడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్యమని అడగొచ్చు లేదంటే చెక్ పై అమౌంట్ ఎంతైనా రాసుకోవచ్చు.. అలా చేయకుండా నేను సెకండ్ హాండ్ స్కూటీ ఇస్తే తీసుకొని వెళ్ళాడు.. వాడు అగ్రిమెంట్ కోసం ఇక్కడికి రాలేదు ఇంకెందుకో వచ్చాడని దశరత్ తో శివన్నారాయణ అంటాడు. వాడు ఒకరి నుండి ఆశించే వాడు కాదు నాన్న అని దశరథ్ అంటాడు.
బావ ఏం ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాడో అర్థం అవ్వడం లేదని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. అలా మాటల్లో కార్తీక్ పై దీప అలుగుతుంది. కార్తీక్ బుజ్జగిస్తాడు. మరదలు అలకమన్పిస్తాడు. ఆ తర్వాత కార్తీక్ గురించి శ్రీధర్ తప్పుగా మాట్లాడుతుంటే కాశీ ఊరుకోడు. ఆ తర్వాత కార్తీక్, దీప ప్రేమగా ఉన్నా వీడియోని జ్యోత్స్న ఫోన్ కి పంపిస్తారు. అది చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది.
ఆ తర్వాత జ్యోత్స్నకి దీప కాల్ చేస్తుంది. బావ ఈ వీడియో ఎందుకు పంపించావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. బావ కాదు మరదలు పంపించిందని దీప అంటుంది. నువ్వా ఎందుకు పంపావని జ్యోత్స్న కోప్పడుతుంది. ఊరికే సరదాగా అని దీప అంటుంది. ఆ తర్వాత పారిజాతానికి దీప వీడియో పంపించిన విషయం చెప్తుంది. అసలు దీపని ఇక్కడికి రాకుండా చేయ్యలని పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. కార్తీక్, దీప ఇంటికి రాగానే.. ఇంట్లో నా బంగారం కన్పించడం లేదని పారిజాతం యాక్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



