Brahmamudi : అటు రాజ్ ప్రపోజ్, ఇటు అక్కపై ఎటాక్..కావ్య ఏం చేయనుంది!
on Jun 25, 2025

స్టార్ మ్ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -756 లో..... రాజ్ పెళ్లి కి వద్దన్నాడని యామిని కోపంగా లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది. దాంతో వైదేహి, రఘనందన్ డోర్ తియ్యమని యామినిని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే రాజ్ వస్తాడు. నా కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వేనని రాజ్ పై కోప్పడుతుంది వైదేహీ. అప్పుడే యామిని డోర్ తీస్తుంది.
అసలు తప్పు నాది బావ.. నీ మనసులో నేను లేను.. ఇంకెవరో ఉన్నారు..నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో వాళ్లనే చేసుకోమని యామిని అనగానే రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. యామిని పేరెంట్స్ మాత్రం షాక్ అవుతారు. ఆ తర్వాత రాజ్ వెళ్ళిపోతాడు. నువ్వేనా ఇలా మాట్లాడేది అని యామినితో వైదేహీ అంటుంది. యామిని సూసైడ్ చేసుకోబోతుంటే తనకి ఒకటి గుర్తొస్తుంది. నువ్వు లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు.. కావ్య తనంతట తనే రాజ్ అంటే ఇష్టం లేదని చెప్పేలా చెయ్యాలని ఒకసారి రుద్రాణి చెప్పిన విషయం యామిని గుర్తు చేసుకుంటుంది.
మరొకవైపు స్వప్న తన పాపని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటుంది. రాహుల్ ని రమ్మని పిలుస్తుంది. వద్దు నువ్వే వెళ్ళమని రాహుల్ అంటాడు. అలా స్వప్న ఒకతే పాపని తీసుకొని వెళ్లేలా రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి.. రాజ్ నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఇష్టం లేదని చెప్పాలని అంటుంది. తరువాయి భాగంలో స్వప్నపై యామిని మనుషులు ఎటాక్ చేస్తారు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



