ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2 : కార్తిక్ ని దీప అర్థం చేసుకోగలదా.. ఆ ఇంట్లో కొత్త డ్రామా!

on May 9, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -39 లో...శౌర్య ఇంటి దగ్గర బయపడుతుంది.. రండి ఇంటికి వెళదామని దీపతో కార్తిక్ అనగానే.. సరేనంటుంది. ఇద్దరు కారు దగ్గరికి వస్తారు. కానీ  కారులో జ్యోత్స్న లేకపోయేసరికి.. ఏమైందని కంగారుపడుతూ జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు కార్తిక్. జ్యోత్స్న కోపంగా అటోలో వెళ్తు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నాకు వేరే వర్క్ ఉంది.. వెళ్తున్నా అంటు జ్యోత్స్న చెప్పగానే.. దీపని తీసుకొని కార్తీక్ బయలుదేర్తాడు.

సర్ ని చూస్తే గొప్పోళ్ళలాగా ఉన్నాడు.. వాళ్ళ ఇంట్లో ఉంటు దీపమ్మ నా దగ్గర పని చేస్తుంది ఏంటని కడియం అనుకుంటాడు. ఆ తర్వాత పారిజాతం బయట కూర్చొని ఉంటుంది. ఆ దీప ని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేయ్యాలని బంటుకి చెప్తుంది. అప్పుడే ఇంటి ముందు ఆటో ఆగుతుంది. ఈ ఇంటి ముందు ఆటో ఆగడమేంటి చీప్ గా ఆ దీప వాళ్లే అయి ఉంటారు.. బయటకు పంపించేయ్ అని బంటుతో పారిజాతం అంటుంది. కానీ ఆటోలో నుండి దిగింది జ్యోత్స్న.. తనని చూసి పారిజాతం షాక్ అవుతుంది. నువ్వేంటి అటో లో వచ్చావని జ్యోత్స్న ని పారిజాతం అడుగుతుంది. చిరాకుపడుతు జరిగింది మొత్తం పారిజాతంతో జ్యోత్స్న చెప్తుంది. దీప నీతో మాట్లాడాలి కార్ దిగు అని కార్తీక్ అంటాడు. నాతో ఏం మాట్లాడాలి.. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానంటూ.. దీప కార్ దిగి వెళ్తుంటే కార్తిక్ ఆపుతాడు. ఎందుకు నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నావ్.. నువు ఇష్టపడే సుమిత్ర అత్తయ్య మేనల్లుడిగా చూడు అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత శౌర్య గురించి మాట్లాడతాడు. అదంతా దూరం నుండి అనసూయ, శోభ, నర్సింహాలు అటుగా వెళ్తు వాళ్ళని చూసి ఆగుతారు. ఇక కార్తీక్ , దీప లు మాట్లాడుకునేది.. నరసింహ శోభలు చూస్తారు. అనసూయకి దీప అంటే అసహ్యం కలిగేలా లేనిపోనివి కల్పించి చెప్తారు. వాళ్ళు మాట్లాడుకునేది వేరు... నర్సింహా శోభ లు కల్పించి చెప్పేది వేరు.. అదంతా విని అనసూయ దీపని తప్పుగా అర్థం చేసుకుంటుంది.

ఆ తర్వాత కోపంగా ఉన్న జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. కార్తీక్ పై ప్రేమని చెప్తూ బావ చాలా మారిపోయాడు. లాస్ట్ బర్త్డే కి డైమండ్ నెక్ లెస్ ఇచ్చాడు. ఇంకా దాచుకున్నానని చూపించాలి  అనుకుంటుంది కానీ నెక్ లెస్ కన్పించదు. ఇంకెక్కడిది చేరాల్సిన వాళ్లకి చేరే ఉంటుంది.. నేను చెప్పినట్టు చెయ్ అని పారిజాతం జ్యోత్స్న కి చెప్తుంది. నెక్ లెస్ కనిపించడం లేదు.. ఎవరో దొంగతనం చేశారని జ్యోత్స్న పారిజాతం హాల్లోకి వచ్చి చెప్తుంది. అప్పుడే దీప, కార్తీక్ ఇద్దరు వస్తారు. ఇంకెవరు తీస్తారు‌.. జ్యోత్స్న రూమ్ లోకి వెళ్ళేది ఈ దీప శౌర్యలే.. వాళ్లే తీశారని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.