ENGLISH | TELUGU  
Home  » TV News

Krishna Mukunda Murari : మీరా చీప్ ట్రిక్స్..‌ పూర్తిగా కీలుబొమ్మలా మారిన ఆదర్శ్ !

on May 9, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -465 లో.. మీరా డబుల్ గేమ్ ఆడుతుందని కృష్ణకు అర్థమవుతుంది. భవాని యొక్క స్నేహితురాలు డాక్టర్ అమృత వారింటికి వస్తుంది. రా కృష్ణా.. నా స్నేహితురాలు డాక్టర్ అమృత.. పెద్ద డాక్టర్.. ఒకసారి నీ నాడి చూసి.. బిడ్డ ఆరోగ్యం అది తెలుసుకుంటుంది. తను చెబితే నాకో ధైర్యం ఉంటుంది కదా అని భవాని అంటుంది. దాంతో మురారీ, కృష్ణ ఇద్దరు ఆశ్చర్యపోతారు. అమృత ఆంటీ.. నేను కూడా డాక్టర్‌‌నే.. నాడి చూడాల్సిన పనిలేదు. కావాలంటే రిపోర్ట్స్ ఒకసారి చూడండి అంటూ లోపలున్న రిపోర్ట్స్ ని తీసుకొచ్చి అమృతకు చూపిస్తుంది. అవి చూసిన అమృత.. అంతా బాగానే ఉంది భవాని కంగారు పడేదేమీ లేదని అంటుంది. 

అమ్మా కృష్ణ.. చాలా తెలివిగా ముందే దొంగ రిపోర్ట్స్ తెచ్చి పెట్టుకుంది.. ఎంతైనా డాక్టర్ కదా.. ఛ అని మీరా మనసులో అనుకుంటుంది. అయితే మురారీ మాత్రం.. అమృతకు రిపోర్ట్స్ ఇచ్చే వరకు కంగారుపడుతూనే ఉంటాడు. ఇక అమృత ఆ మాట చెప్పేసి.. కాసేపు యోగక్షేమాలు మాట్లాడి వెళ్లిపోతుంది. కాసేపటికి పంతుల్ని పిలిపించు రేవతి.. బిడ్డ చక్కగా పుట్టాలని పూజ చేయిద్దామని‌ భవాని అంటుంది. దాంతో రేవతి పంతుల్ని పిలిపిస్తుంది. ఇక మురారీ, కృష్ణ ఇద్దరు ఈ సమయంలో పైకి వెళ్లి.. రిపోర్ట్స్ ముందే తెచ్చిపెట్టుకోవడం మంచి పని అయ్యిందని ఊపిరి పీల్చుకుంటారు. ఇక పంతులు రావడంతో అంతా కిందకు వస్తారు. అప్పటికి ఆదర్శ్, మీరా షాపింగ్ వెళ్లడంతో ఇంట్లో ఉండరు. పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం.. రేపు మంచి ముహూర్తం ఉందమ్మా అని పంతులు చెప్పగా.. అయితే రేపే పూజ ఏర్పాట్లు చేద్దాం పంతులు గారు.. కావాల్సిన లిస్ట్ మా మధుకి ఇవ్వండి.. మధుని ఆ ఏర్పాట్లు చూడమని భవాని అంటుంది. కాసేపటికొ ఆదర్శ్, ముకుంద షాపింగ్ చేసి వస్తారు. వాళ్ళిద్దరు కలిసి రావడంతో కృష్ణ, రజిని, సంగీత, రేవతి, భవాని, మురారి ఇలా అంతా కాస్త వింతగా చూస్తారు. ముకుందను షాపింగ్‌కి తీసుకుని వెళ్లి చీరలు కొన్నా అమ్మా.. లాస్ట్ టైమ్ నువ్వు కొన్నవన్నీ పాతవి అయిపోయాయని అందుకే తీసుకెళ్ళానని అంటాడు.

ఆదర్శ్ అలా చెప్పగానే.. మంచి పని చేశావ్. మీరాను మేము పట్టించుకోకపోయినా నువ్వు పట్టించుకున్నావంటు మురారి పొగుడుతాడు. వెళ్లండి వెళ్లి తినండి అని భవాని. కాసేపటికి కృష్ణ తన గదిలోకి వెళ్లి.. ఆదర్శ్ గురించి ఆలోచిస్తుంది. అసలు మీరా ఉద్దేశమేంటి? తను మంచిగా ఉండి ఆదర్శ్‌ని ఇష్టపడుతుంటే ఇద్దరికి పెళ్లి చేయొచ్చు.. కానీ సంగీతకు ఆదర్శ్‌తో పెళ్లి చేస్తానని చెప్పి.. తను ఆదర్శ్‌తో క్లోజ్‌గా ఉంటూ ఎందుకు ఇలా చీప్‌గా ప్రవర్తిస్తోంది. ఏదోక్కటి చెయ్యాలి. లేదంటే ఆదర్శ్ అన్యాయం అయిపోతాడని కృష్ణ అనుకుంటుంది. ఇంతలో మురారీ వచ్చి.. అబ్బా అయ్యో అంటూ కాలు పట్టుకుంటాడు. ఏమైంది ఏసీపీ సర్.. ఎందుకు నొప్పిగా ఉంది..పడ్డారా అంటూ హడావుడి చేస్తుంది కృష్ణ. పడ్డానంటాడు మురారి. దాంతో కృష్ణ మరింతగా కంగారుపడిపోతుంది. వెంటనే కృష్ణను దగ్గరకు లాక్కుని.. నీ ప్రేమలో పడ్డానని మురారి నవ్వుతూ మాట్లాడటంతో.. తను డ్రామా ఆడినట్లు అర్థం చేసుకుని కృష్ణ కూడా నవ్వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.