ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoyindhi Manasu : ఆమెను తన దగ్గరికి పంపించమని ప్రియుడి డీలింగ్!

on May 9, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -91 లో.. రామలక్ష్మి టిఫిన్ చెయ్యడానికి రాకపోవడంతో రామలక్ష్మి దగ్గరికి సిరి వెళ్తుంది. ఎందుకు అలా ఉంటున్నావ్ వదిన.. మా కోసం పెళ్లి చేసుకున్నారు.. మాకు గొప్ప బహుమానం ఇచ్చారు.. కష్టమో నష్టమో పెళ్లి చేసుకున్నారు.. సంతోషం గా ఉండాలి..  నువ్వు అలా డల్ గా ఉంటే నాకు ఎలా ఉంటుంది వదిన.. రండి టిఫిన్ చెయ్యడానికి అని సిరి పిలుస్తుంది. టిఫిన్ కి రాకపోతేనే ఇంత భాదపడుతున్న సిరి.. ఇక మేమ్ పెళ్లి చేసుకున్నట్లు నాటకం ఆడుతున్నామని తెలిస్తే ఎంత బాధ పడుతుందోనని రామలక్ష్మి అనుకుంటుంది.

రామలక్ష్మిని సిరి తీసుకొని టిఫిన్ చెయ్యడానికి వస్తుంది. అప్పుడే సీతాకాంత్ టిఫిన్ చెయ్యడం పూర్తవుతుంది. చెయ్యిని న్యాప్కిన్ తో కాకుండా రామలక్ష్మి చీరతో తుడుచుకుంటాడు సీతాకాంత్. అది చూసి నువ్వు వదిన చీరతో తుడుస్తున్నావని సిరి అనగానే.. అయ్యో సారీ రామలక్ష్మి చూడలేదని సీతాకాంత్ అంటాడు. పర్లేదు సర్ అని రామలక్ష్మి అంటుంది. నువ్వు కావాలనే వదిన కొంగుకి తుడిచావ్ .. నీకు వదిన పై ఎంత ప్రేమ ఉందో తెలుసు అన్నయ్య అని సిరి అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఫైల్ కోసం వెతికుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వచ్చి నేను కూడా వెతుకుతానంటుంది... రామలక్ష్మి వెతుకుతుంటే బల్లిని చూసి బయపడి సీతాకాంత్ ని వచ్చి హగ్ చేసుకుంటుంది.. అప్పుడే సీతా షర్ట్ బటన్ కి రామలక్ష్మి తాళి చిక్కుకుంటుంది. దాంతో రామలక్ష్మి తీస్తుంటే సీతాకాంత్ ప్రేమగా చూస్తాడు. అదంత శ్రీలత, సందీప్ లు చూస్తారు. సీతాకాంత్ కళ్లలో రామలక్ష్మి ప్రేమని చూసావా అని సందీప్ తో శ్రీలత అంటుంది. ఆ రామలక్ష్మి ఈ ఇంటి కోడలైతే తనకున్న తెలివితో ఆస్తిని మనకు దక్కకుండా చేస్తుందని శ్రీలత అంటుంది.

మరొకవైపు అభి సీతాకాంత్ తో మాట్లాడి.. ఒక దగ్గరికి రండి అని చెప్తాడు. సీతాకాంత్ సరే అంటూ బయలుదేర్తాడు. ఏంటి నిజం తెలిసాక కూడా ఇంత ధైర్యంగా ఫోన్ చేశాడని సీతాకాంత్ అనుకుంటాడు. నేను చెప్పిన డీలింగ్ కి ఒప్పుకుంటే సరే.. లేదంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్ అని అభి ఫోన్ లో చెప్తాడు. ఆ తర్వాత అభి దగ్గరికి వచ్చిన సీతాకాంత్.. నీ గురించి మొత్తం తెలిసిపోయింది రా అని అంటాడు.. నేను రామలక్ష్మి ని వదిలెయ్యాలంటే నన్ను సెటిల్ చెయ్యాలని అభి అంటాడు. ఎంత కావాలని సీతాకాంత్ అనగానే.. దానికంటే ముందు ఇంకా ఫ్రెండ్లీ డీలింగ్..  నువ్వు రామలక్ష్మిని నీకు నచ్చిన అన్ని రోజులు నీ దగ్గర ఉంచుకో ఆ తర్వాత నా దగ్గరకి పంపించు.. తనపై నాక్కూడా మోజు ఉందని అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కాసేపటికి సీతాకాంత్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు... ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేయండి అని అభి ఫోన్ లో చెప్తాడు. శ్రీవల్లి టీవీ చూస్తుంటే..... సీతాకాంత్, రామలక్ష్మిల గురించి న్యూస్ లో వస్తుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.