ENGLISH | TELUGU  
Home  » TV News

ఫోటో చూసి ఓకే చేసేసారు...ఎన్టీఆర్ కోసం ఆ సాంగ్ చేశా

on May 9, 2024

 

అలీతో సరదాగా షోకి ఈ వారం చందమామ ఎంట్రీ ఇచ్చింది. అదేనండి కాజల్ అగర్వాల్. "లక్ష్మి కళ్యాణం కోసం మిమ్మల్ని డైరెక్టర్ తేజ ఎక్కడ చూసారు " అని అడిగాడు ఆలీ. "ఫొటోస్ చూసి సెలెక్ట్ చేశారు. లైఫ్ లో అదే నా ఫస్ట్ ఆడిషన్. అప్పుడు నన్ను ఏడవమని చెప్పారు. నా లైఫ్ లో రీజన్ ఏమీ లేదు కదా ఏడవడానికి ...నేనెందుకు ఏడవాలి" అని అడిగాను." ఆ తర్వాత మా నాన్న వచ్చి ఏడుపు వచ్చే ఒక విషయం చెప్పారు. దాంతో నాకు నిజంగానే ఏడుపొచ్చేసింది.

అలా ఏడ్చేసరికి నా ఆడిషన్ ఓకే ఐపోయింది" అని చెప్పింది కాజల్. "సత్యభామ...ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ కదా..అందమైన పోలీస్ ఆఫీసర్ రోల్ " అనేసరికి "అవును చాలా ఇంపార్టెంట్, స్ట్రాంగ్ రోల్ ". "అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా" అనేసరికి "లవ్ విత్ అరేంజ్డ్ మ్యారేజ్. మేం ఒకరికి ఒకరకం పదేళ్లుగా తెలుసు. కరోనా టైంలో ఎవరింట్లో వాళ్ళం లాక్ అయ్యే బదులు ఇద్దరం ఒకే ఇంట్లో లాక్ అవుదాం అనుకుని పెళ్లి చేసుకున్నాం" అని చెప్పింది. "ఇంత అందమైన కాజల్ కి కాలేజ్ లో ఒక వంద ప్రొపోజల్స్ వచ్చాయా" అని అడిగాడు ఆలీ. "అవును వచ్చాయి . అందులో ఒక ఫ్యాన్ నా కోసం ఒక అందమైన కవిత కూడా రాసాడు.

అది నేను మీకు చూపిస్తాను" అని చెప్పింది కాజల్. "జనతా గ్యారేజ్ లో ఒక స్పెషల్ సాంగ్ చేసావ్ కదా..హీరో కోసమా, మంచి బ్యానర్ అనా, డైరెక్టర్ కోసమా".. "ఎన్టీఆర్ కోసం చేశా" అని చెప్పింది. ఇక స్క్రీన్ ప్లే రాసిన శశి కిరణ్ తిక్కని కూడా ఈ షోకి ఇన్వైట్ చేసాడు ఆలీ. రాగానే "మీది రాజమండ్రి నాది రాజమండ్రి..రెండు సినిమాలు చేశారు కదా రాజమండ్రి యాక్టర్ ని పెట్టుకోవాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా" అని అడిగేసరికి "సత్యభామ 2 లో కచ్చితంగా ఉంటారు" అని చెప్పేసింది కాజల్. "తల్లి అయ్యాక బిడ్డతో బాండింగ్ ఎక్కువగా ఉంటుంది..మరి  కాజల్ ఎం తెలుసుకుంది ఈ విషయంలో" అనేసరికి "ఎం చేయాలి..ఎలాంటి సాక్రిఫైస్ చేయాలో తెలుసుకున్నాను" అని చెప్తూనే ఎమోషనల్ అయ్యింది కాజల్.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.