ENGLISH | TELUGU  
Home  » TV News

విరాట్ కోహ్లీ మీ గల్లీలో వచ్చి ఆడతాడా..? గెస్ట్ ని ఇలా అవమానిస్తారా ?

on May 9, 2024

 

యాంకర్ రవి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఫిమేల్ యాంకర్స్ లో శ్రీముఖికి ఎంత పేరుందో మేల్ యాంకర్స్ లో రవికి అంత పేరుంది. ఐతే రీసెంట్ గా రవి దావత్ షోలో కనిపించాడు. ఇక హోస్ట్ రీతూ చౌదరి ఎన్నో ప్రశ్నలు వేసింది. "మీరు పక్కా కమర్షియల్ అంట కదా" అనేసరికి "అవును నేను డబ్బు కోసమే చేస్తా విరాట్ కోహ్లీ ఫ్రీగా వచ్చి మీ గల్లీల్లో ఆడతాడా..." అని రివర్స్ లో అడిగాడు. "ఐతే ముందు నేను కొరియోగ్రాఫర్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చి చాలామందిని కలిసాను. అప్పుడు ఒక పెద్దమనిషి నాగార్జున ఏమన్నారంటే ముందు పని నేర్చుకో అని చెప్పి తీసుకెళ్లి మా మ్యూజిక్ లో ఒక షో చేయమన్నారు.

అలా నా జర్నీ స్టార్ట్ అయ్యింది". అని చెప్పాడు. "ఐతే నాకు పెళ్ళైన విషయాన్ని చాలా రోజులు రివీల్ చేయలేదు ఎందుకంటే తన భార్యతో కలిసి బయటకు వెళ్తే నీ భార్య లాస్య కదా అని అగిడేవారు. అందుకే ఈ విషయం గురించి బయట చెప్పాలని అనిపించలేదు. కానీ తర్వాత ఒక షోకి నా భార్యను, పాపను తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాను" అని చెప్పాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ గురించి చెప్తూ  "బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మొదటి 15 రోజుల్లోనే కూతురిని మర్చిపోయా కళ్లు మూసుకుని తల్చుకుంటే కూతురు మొహం కూడా గుర్తురాలేదు.." అన్నాడు. ఇక ఈ షో ప్రోమో ఫైనల్ లో "మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్ మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యింది" అని అడిగేసరికి " దీనికి నేను ఆన్సర్ చెప్పను..నేను హర్ట్ అయ్యాను ..ఐనా ఏంటిది నాన్సెన్స్ కాకపోతే" అన్నాడు రవి. "నాన్సెన్స్ అని ఎలా అంటావ్" అని రివర్స్ అయ్యింది రీతూ. "ఐనా షోకి గెస్ట్ ని పిలిచి ఆ మాట ఎలా అంటది" అని తెగ ఫీలయ్యాడు. ఐతే ఇదంతా నటన అనే విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే రవిలో ఉన్న యాంకర్ షేడ్ మాత్రమే కాకుండా మిగతా షేడ్స్ చూపించడం కోసమే ఇలా గొడవపడినట్టు నటించాడేమో అనే విషయం తెలిసిపోతుంది. మరి ఇది నిజామా కాదా తెలియాలంటే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి.


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.