బిగ్ బాస్ లోకి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ కన్ఫర్మ్...
on Jul 11, 2025

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పుడు ఈ షోకి కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు బిగ్ బాస్ టీమ్ఐ తే కొంతమంది కంటెస్టెంట్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారంటూ కూడా తెలుస్తోంది. ఐతే రీసెంట్ ఆదిరెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో పికిల్స్ రమ్య బిగ్ బాస్ సీజన్ 9 కి కంఫర్మ్ ఐనట్టు చెప్పాడు. అలాగే బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం ఈసారి సీజన్ లో కామన్ మ్యాన్ కేటగిరీలో 9 మంది ఉండొచ్చు అని 70 % , ఉండకపోవచ్చు అని 30 % తెలుస్తోంది అంటూ పోస్ట్ చేసాడు. 9 వెర్సెస్ 9 అనే థీమ్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ అంటూ చెప్పాడు. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. వీళ్లకు చాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిట్టి పికిల్స్ అంటే చాలు ఈ ముగ్గురు సిస్టర్స్ గుర్తొస్తారు.
వీళ్ళ మీద వీడియోస్, ట్రోల్స్, మీమ్స్, గలీజ్ కామెంట్స్, రీల్స్, వెటకారపు డైలాగ్స్ ఒక్కటేమిటి అన్ని రకాలుగా వీళ్ళు సోషల్ మీడియాలో నోట్లో బాగా నానారు. దాంతో వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. తిడితే తిట్టారు కానీ దగ్గరుండి బిగ్ బాస్ కి పంపిస్తున్నారుగా అంటూ కొన్ని ఛానెల్స్ కూడా పోస్టులు పెట్టాయి. ఏదేమైనా ఫైనల్ గా వీళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం కూడా వచ్చేసింది. అలాగే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా బిగ్ బాస్ కి కన్ఫర్మ్ ఐనట్టు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్ సింగర్ శ్రీతేజ కూడా వెళ్ళబోతున్నట్టు న్యూస్ వస్తోంది. ఇక రీతూ చౌదరి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోందంటూ సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



