Jayam serial : పోలీసులు వీరుని పట్టుకుంటారా..గంగ కష్టం ఫలించేనా!
on Sep 11, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -52 లో.....గంగ ఏ తప్పు చెయ్యలేదు.. అసలు ఇదంతా చేస్తున్న వాడి టార్గెట్ ఎవరని కనిపెట్టడానికి ఇదంతా చేసాను.. మీరు సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ రికలెక్ట్ చెయ్యాండి అని చెప్పి పోలీసులని పంపిస్తాడు రుద్ర.... అక్కడ వీరు మనిషి రుద్రకి డిఫరెంట్ గా కన్పిస్తాడు. ఎవరు నువ్వు అని రుద్ర అడుగగా నేనే పెట్టించాను బావ.. వాళ్ళ నాన్న మావయ్య గారికి తెలిసట అని వీరు కవర్ చేస్తాడు.
ఆ తర్వాత రుద్ర, పెద్దసారు ఇంకా గంగ కలిసి పైడిరాజుతో మాట్లాడతారు. ఇది గాని నీ వెనకాలున్నవాళ్లు చెయ్యడం లేదు కదా అని పైడిరాజుని అడుగుతాడు రుద్ర. నాకేం తెలియదని పైడిరాజు అంటాడు. ఆ తర్వాత రుద్రకి గంగ థాంక్స్ చెప్పాలని ట్రై చేస్తుంది. ఏదో ఒకరకంగా థాంక్స్ చెప్పాడానికి ప్లాన్ చేస్తుంది. అది ఫెయిల్ అయి రుద్ర వచ్చి గంగ పై కోప్పడతాడు.
ఆ తర్వాత గంగ, మక్కం స్కూటీ పై వెళ్తుంటే.. అప్పుడే గతంలో ఒకమ్మాయిని ఏడిపించి కార్ లో పోయినప్పటి వ్యక్తి ఉన్న కార్ కనిపిస్తుంది. ఆ కార్ నెంబర్ గుర్తు పట్టి ఫాలో అవుతుంది. అది వీరుది కానీ వీరు డైవర్ట్ అయి వెళ్ళిపోతాడు. గంగ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రెండు నెలల క్రితం ఒకతను అమ్మాయిని ఏడిపిస్తు కన్పించాడు. ఒకతను కార్ లో ఉన్నాడు.. తన బాస్ తో గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్ళాలని.. ఆ కార్ లో ఉన్నతని మనిషి వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టారని ఎస్ఐకి గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



