ENGLISH | TELUGU  
Home  » TV News

సిరి వాళ్ళ అమ్మ తిట్టిన తిట్లకి కుమిలిపోయిన స్వప్న

on Apr 13, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-68 లో.. రాజ్ ని చూపించడానికి కనకం వాళ్ళ అక్క చుట్టుపక్కల ఉండేవాళ్ళని తీసుకొస్తుంది. అల్లుడు గారికి మర్యాద చేయట్లేదేంటే చెల్లి అని కనకంని అంటుంది. అన్ని మర్యాదలు చేస్తామని కనకం అంటుంది. ఒక మూడు రోజులు ఉండాలని కనకం వాళ్ళ అక్క రాజ్ తో అంటుంది. కావ్య దగ్గరకి వెళ్ళి మెల్లగా మాట్లాడుతుంటాడు రాజ్. నేనుండనని చెప్పు అని రాజ్ అనగా.. మూడు రోజులు కాదంటే నాలుగు రోజులు ఉందామని చెప్పగానే అందరూ సంతోషిస్తారు.

ఆ తర్వాత రాజ్ కావ్య గదిలోకి వెళ్ళాక.. ఎందుకలా అన్నావని కావ్యని తిడతాడు రాజ్.  మరోవైపు రాజ్ వాళ్ళ ఇంట్లో అపర్ణ డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి.. నా మనసేం బాలేదని, నేను తినని చెప్తుంది. ‌దాంతో సీతారామయ్య అన్నం పరబ్రహ్మ స్వరూపం, తినమ్మా అని చెప్పగానే అపర్ణ భోజనం తినడానికి కూర్చుంటుంది. పనిమనిషి శాంతం అన్నం వేసి కూర వడ్డిస్తుండగా వద్దని చెప్పి.. కారంతో అన్నం తింటుంది. కన్నీళ్ళతో అన్నం తినడం చూసి.. "నీ కన్నీళ్ళకి కారణం ఈ కారమా.. లేక మమకారమా" అని రాజ్ నానమ్మ అడిగినా వినిపించుకోకుండా ఇంకా కారం వేసుకొని తింటుంది. నువ్వు నీ కొడుకుని అర్థం చేసుకోడానికి ప్రయత్నించమని అపర్ణతో సీతారామయ్య చెప్తాడుమరోవైపు అప్పు ఇంటి నుండి బయటకు వెళ్తుండగా కృష్ణమూర్తి ఆపుతాడు. అప్పు ఎక్కడికెళ్ళున్నావ్ అని అడుగగా.. అప్పుకే అని అంటుంది. అప్పుడే కావ్య వచ్చి వింటుంది. ఏమైందని అప్పుని కావ్య అడుగగా.. నాన్న రంగులు వేసిన వాటికి సగం డబ్బులే వస్తున్నాయని చెప్తుంది. ఇవన్నీ ఇప్పుడు అక్కకి చెప్పడం అవసరమా.. బావకి కూల్ డ్రింక్ తీసుకురాపో అని అప్పుని కోప్పడుతాడు కృష్ణమూర్తి. ఆ తర్వాత కావ్య, కృష్ణమూర్తి ఇద్దరు ఎమోషనల్ అవుతారు. నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా అని అడుగగా.. ఎందుకు ఉండటం లేదు నాన్న.. అయ్యో నాన్న బాగా చూసుకోకపోతే.. నేను అడుగగానే మన ఇంటికి ఎందుకు తీసుకొస్తాడని కావ్య అంటుంది. మరోవైపు స్వప్న ఒక్కతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిరి ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ సిరి .. నువ్వు నమ్మి వెళ్ళిన వ్యక్తి నిన్ను మోసం చేసాడా, సర్లే ముందు తిను తర్వాత మాట్లాడుకుందామని అంటుంది. ఆ తర్వాత స్వప్న తింటుండగా సిరి వాళ్ళ అమ్మ వచ్చి.‌. "సిరి ఏం చేస్తున్నావ్ నువ్వు.. ‌ పెళ్ళి నుండి లేచిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారా  అని నన్నంటారు. తల్లి ఆశల్ని, చెల్లి జీవితాన్ని గాలికి వదిలేసిన నీకు ఇవేం పట్టవని నాకు తెలుస.. నువ్వు తినమ్మా" అని స్వప్నతో అంటుంది సిరి వాళ్ళ అమ్మ.  సిరి వాళ్ళ అమ్మ తిట్టిన తిట్లకు కుమిలిపోయిన స్వప్న.ఆకలి చచ్చిపోయిందని చెప్పి అక్కడి నుండి తినకుండా బయటకు వచ్చేస్తుంది. మరోవైపు రాజ్ ఉక్కపోతలో కావ్య గదిలో ఉండగా కనకం వాళ్ళ అక్క, కనకం వచ్చి.. ఈ లుంగీ కట్టుకోండి.. మీరు కట్టుకుంటే మేం సంతోషిస్తామని చెప్పేసి  వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.