ENGLISH | TELUGU  
Home  » TV News

Guppedantha Manasu : మను ప్లాన్ సక్సెస్ అయ్యేనా.. వాళ్ళు అతడిని నమ్మించగలరా?

on May 9, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1070 లో..  వసుధార గురించి రాజీవ్ కలలు కంటుంటాడు. అప్పుడే శైలేంద్ర వచ్చి రాజీవ్ ముందు కూర్చొని ఉంటాడు. శైలేంద్ర మొహాన్ని చేత్తో పట్టుకొని మరదలు పిల్ల అంటూ కలవరిస్తుంటాడు రాజీవ్. ఏయ్ రాజీవ్.. ఏంటి? అని శైలంద్ర అనగానే.. రాజీవ్ నిద్రనుండి మేల్కొని.. నువ్వా భయ్యా నా మరదలనుకున్నానని రాజీవ్ అంటాడు.

నువ్వు ఇలా మరదలు పిల్ల అంటూ తనకి కన్పిస్తుంటే.. వాళ్ళకి నువ్వు బ్రతికే ఉన్నావని డౌట్ వచ్చిందని శైలేంద్ర అంటాడు. అనుపమ బాధలో మహేంద్ర పట్టించుకోవడం లేదని ఇంకొకసారి ఆ వసుధార దగ్గరికి వెళ్ళకని శైలేంద్ర అనగానే.. నాకు ఈ ఆలోచననే రాలేదని రాజీవ్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత బయటకు రాకని రాజీవ్ కి శైలేంద్ర చెప్పి వెళ్ళిపోతాడు. నా మరదలు పిల్లని చూడకుండా ఎలా ఉంటానని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత  వసుధార దగ్గరికి రాజీవ్ వెళ్లి.. కర్చీఫ్ కి మత్తు ఇచ్చి వసుధార ముక్కు దగ్గర పెట్టినట్టు రాజీవ్ ఊహించుకుంటాడు. ఆ తర్వాత రాజీవ్ నిజంగానే వసుధార దగ్గరికి వస్తాడు. వసుధార వెనకాల నుండి .. ఎవరు మీరు అంటూ రాజీవ్ ని పిలుస్తుంది. నేనే మరదలు పిల్ల అంటూ తన వైపు తిరిగి ముక్కుకి మత్తు ఇవ్వాలని ట్రై చేస్తాడు వసుధార తప్పించుకొని.. మావయ్య అంటూ మహేంద్రని పిలిచేలోపే రాజీవ్ వెళ్ళిపోతాడు. ఇక మహేంద్ర, అనుపమ బయటకు వస్తారు. ఏమైందని వాళ్ళు అడుగగా.. రాజీవ్ వచ్చాడని జరిగింది చెప్తుంది. అది విని ఎలాగైనా రాజీవ్ బ్రతికే ఉన్నాడని నిరూపించి.. మనుని బయటకు తీసుకొని రావాలని మహేంద్ర అంటాడు.

వసుధార, మహేంద్ర ఇద్దరు స్టేషన్ కి వెళ్లి.. ఇన్‌స్పెక్టర్ ని కలిసి మనుతో మాట్లాడాలని పర్మిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత వసుధార, మహేంద్ర లు రాజీవ్ వచ్చాడంటూ జరిగింది చెప్తాడు. ఈ విషయంలో మనకి హెల్ప్ చేసేది ఒక శైలేంద్ర మాత్రమే.. మనం ఎండీ సీట్ ఇస్తున్నట్లు నమ్మించాలి.. నేను ఒక ప్లాన్ చెప్తాను.. నా డబ్బులు నాకు ఇవ్వకుంటే కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని నోటిసులు పంపిస్తానని మను చెప్తాడు.. సరే ఎలాగైనా శైలేంద్ర  నమ్మేలా మేమ్ చూసుకుంటామని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.