ENGLISH | TELUGU  
Home  » TV News

Brahmamudi : భార్య ఇంట్లో నుండి వెళ్తుందా.. తన భర్త అసలు నిజం చెప్పగలడా?

on May 9, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -405 లో..రాజ్ బయటకు వెళ్తుంటే.. మళ్ళీ వస్తావా అటు నుండి అటే వెళ్తావా అని అపర్ణ అడుగుతుంది. ఎందుకు అంటే రేపటితో నీకు ఇచ్చిన గడువు పూర్తవుతుందని చెప్తున్నాను.. బాబు గురించి నిజం చెప్పమని అపర్ణ అంటుంది. ఇక ఇంట్లో అందరు అపర్ణ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు.

నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు.. దానికి సొల్యూషన్ అనుకుంటున్నావా అది చెప్పు.. ఒకవేళ ఆ బిడ్డ తల్లిని నీకు భార్యగా తెచ్చుకుంటావా? నీ మనసులో ఉన్న విషయం చెప్పు.. దానికి మేం అందరం ఒప్పుకుంటామని అపర్ణ అనగానే.... అంటే మీరేం అంటున్నారు ఆంటీ? నా చెల్లికి అన్యాయం చెయ్యమని చెప్తున్నారా అని స్వప్న అంటుంది. ప్రకాష్ కూడా కావ్యకి అన్యాయం చేసే నిర్ణయాన్ని మేమ్ సమర్థించమని అంటాడు. ఆ తర్వాత ఇక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని అపర్ణ తో రాజ్ అంటాడు. చూసావా ఇప్పుడు ఏమంటావ్ నా భర్త ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా చూస్తాను అన్నావ్ కదా ఇప్పుడు ఏమైందని కావ్యని అపర్ణ అడుగుతుంది. నేను ఓడిపోయాను అత్తయ్య.. మీరు ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాను.. నేను నా భర్తతో కలిసి వెళ్లిపోతానని కావ్య అంటుంది. అందరు షాక్ అవుతారు. మంచి నిర్ణయం తీసుకున్నావ్ అమ్మ.. కొడుకుని ఇంట్లో నుండి పంపించిన తల్లి.. కోడలిని పంపించకముందే నువ్వు మంచిగా ఆలోచించావని కావ్యతో సుభాష్ అంటాడు.

రాజ్ విషయం లో నువ్వు ఒక్క దానివే నిర్ణయం తీసుకుంటావా? నాకు హక్కు లేదా అని సుభాష్ అంటాడు.. సరే అందరు నా నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు కదా.. నా విషయంలో నేను నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉందని అనుకొని నిర్ణయం తీసుకుంటున్నాను. రేపు రాజ్ బాబు గురించి నిజం చెప్పకుంటే.. నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అపర్ణ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి.. నీ నిర్ణయం సరైనది కాదని అంటాడు. నేను రాజ్ నుండి నిజం చెప్పించడానికి ఇలా ఉన్నాను కానీ చెప్పట్లేదని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో రాజ్ ఇంట్లో నుండి వెళ్ళపోతుంటే.. నేనే వెళ్ళిపోతాను అంటూ అపర్ణ వెళ్లిపోతుంటుంది. ఆగు నిజాలు తెలియాలి.. నేటితో ఈ రహస్యం బయటపడాలని సుభాష్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.