జ్యోతక్కకు సీమంతం...చీరా సారె పెట్టిన జోగిని శ్యామల
on Jul 30, 2025

మా బోనాలు జాతర స్పెషల్ ఎపిసోడ్ కి జోగిని శ్యామల వచ్చి తీన్మార్ డాన్స్ వేసి ఆడియన్స్ ని అలరించారు. ఇక ఆమె గోల్కొండ జగదాంబ అమ్మవారికి లష్కర్ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పించిన సారె అంటే చీరా, పూలు, పళ్ళు, బెల్లం, పసుపుకుంకుమను ఈ షోకి తీసుకొచ్చారు. ఈ షోలో త్రి టీమ్స్ ఆడాయి. గోల్కొండ పహిల్వాన్స్, హైదరాబాద్ దగడ్స్, సికింద్రాబాద్ షేర్స్. ఐతే జోగిని శ్యామలను లష్కర్ కి ఆడపడుచుగా పిలుచుకుంటారు అంటే సికింద్రాబాద్ అన్నమాట.
ఇక ఈ సారెని సికింద్రాబాద్ షేర్స్ గెలుచుకున్నారంటూ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఓడిపోయిన వాళ్లకు కూడా కూడా అమ్మవారి సారెను అందించారు అది కూడా లక్కీ డిప్ ద్వారా. అమ్మవారి దగ్గర పెట్టిన తీపి బెల్లం డాక్టర్ బాబు గెలుచుకున్నాడు. పసుపు కుంకుమను గెలుచుకుంది శ్రీసత్య. ఇక పళ్ళు, కొబ్బరిని గెలుచుకున్నాడు ఇమ్మానుయేల్. తర్వాత బిత్తిరి సత్తి వచ్చి సారె పళ్ళాన్ని పట్టుకుని " గేమ్ గమ్మత్తు కోసమే ఆడతాం. గెలుపోటములు ఏమీ ఉండదు. అందరూ సంతోషంగా ఉండాలి. లేకలేక రాకరాక మా అక్క నేను చాలా రోజుల తర్వాత కలిసాం. కలిసినందుకు మా ఇంటి ఆడపిల్లకు బట్టలు పెట్టాలి కదా. మరి అమ్మవారి చీర ఆమెకు పెడితే ఇంకా సంతోషం కదా..ఇంతకన్నా ఎక్కువ ఇస్తాం మా అక్కకు..మంచిగా మురుసుకో..మేమంతా మంచిగా ఉండాలని దీవెనలు ఇవ్వు" అన్నాడు. అలా జోగిని శ్యామల జ్యోతక్కకి సారె ఇచ్చింది. ఇక జ్యోతక్క కన్నీళ్లు పెట్టుకుంది. "మీ అందరికీ తెల్సు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. రెండేళ్ళ నుంచి పిల్లల కోసం చూస్తున్నాం. నేను దీన్ని చిన్న సీమంతంగా భావించి ఈ ఏడాది కచ్చితంగా సీమంతం చేసుకుంటాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంది. "అతి త్వరలో అమ్మవారు మీ ఇంటికి వచ్చేస్తారు" అంటూ శ్రీముఖి విష్ చేసింద
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



