ENGLISH | TELUGU  
Home  » TV News

Guppedantha Manasu : వేరే అమ్మాయితో ఛాటింగ్ చేస్తున్నాడంటూ భర్తపై భార్య ఫైర్!

on May 9, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1069 లో.. వసుధార దగ్గరికి అనుపమ వస్తుంది. మనుని ఎలా బయటకు తీసుకొని రావాలో ఆలోచిస్తున్నావా అని అనుపమ అడుగగా.. అవునని వసుధార అంటుంది. అంత ఈజీ కాదమ్మా ఆ శైలేంద్ర, రాజీవ్ లాంటి దుర్మార్గులకి ఎదరు వెళ్తున్నావని అనుపమ అంటుంది. తప్పదు మేడమ్ మను లాంటి వాళ్ళు జైల్లో ఉండకూడదు.. కాలేజీ ప్రాబ్లెమ్ లో ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేశాడు. రాజీవ్ నాతో గొడవ పడిన ప్రతిసారీ నాకు హెల్ప్ చేశాడు. నాకే కాదు చాలా మందికి హెల్ప్ చేసాడని వసుధార అంటుంది.

ఆ తర్వాత మనుని ఎలాగైనా బయటకు తీసుకొని వస్తానని వసుధార అంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. మనుని కచ్చితంగా బయటకు తీసుకొని వస్తాను.. నా ప్రాణం అడ్డు వేసి అయిన సరే.. ఆ శైలేంద్ర, రాజీవ్ ల ప్రాణం తీసి అయిన సరే మనుని తీసుకొస్తానని మహేంద్ర అంటాడు. ఎంతైనా మీ కొడుకు కదా మావయ్య అని వసుధార అనగానే.. అనుపమ సైగ చెయ్యడంతో అదే కొడుకులాంటి వాడు కదా అని వసుధార అంటుంది. మరొకవైపు శైలేంద్ర పడుకున్నాక.. ధరణి తన ఫోన్ తీసుకొని ఓపెన్ చేస్తుంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి ఫోన్ లాక్కొని.. ఏం చేస్తున్నావని అడుగుతాడు. ధరణి తెలివిగా. నాకు తెలియకుండా నువ్వు ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నావ్.. ఫోన్ ఇవ్వండి ఎవరో చూస్తానని అంటుంది. నేను ఇవ్వను.. నువ్వు అసలు ఎందుకు తీసుకున్నావని శైలేంద్ర అనగానే.. ఇప్పుడే మీ సంగతి చెప్తానంటూ ఫణింద్ర, దేవయానిని పిలుస్తుంది. నాకు అన్యాయం జరుగుతుంది మావయ్య.. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను.. మీ అబ్బాయి ఎవరితోనో గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతున్నాడు.. మెసేజ్ చేస్తున్నాడని ధరణి అనగానే.. అందరు షాక్ అవుతారు.

ఎందుకు అలా చేస్తున్నావ్? బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకొని అలా ఎందుకు చేస్తున్నావని ఫణీంద్ర అంటాడు. అయ్యో నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నానని శైలేంద్ర అంటాడు. మరి ఫోన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదని ధరణి అంటుంది. ఫోన్ చూపించమని ఫణీంద్ర చెప్పగానే.. శైలేంద్ర చూడండి అంటు చూపిస్తాడు. డిలీట్ చేశాడంటు ధరణి అంటుంది. ఇంకొకసారి ఇలాంటివి చేస్తే మర్యాదగా ఉండదని ఫణీంద్ర అంటాడు. నాక్కూడా ఇలాంటివి నచ్చావ్ శైలేంద్ర అంటు దేవయాని కూడా అంటుంది. మరొకవైపు ధరణి ని శైలంద్ర ఫోన్ లో నెంబర్ చూడమని చెప్పానని మహేంద్రతో వసుధార అంటుంది. అప్పుడే ధరణి ఫోన్ చేస్తుంది. నేను ఫోన్ తీసుకొని చూద్దామనుకున్న ఆలోపే ఆయనకు డౌట్ వచ్చింది.. నేను డైవర్ట్ చేసానంటూ జరిగిందంతా చెప్తుంది. సరే నేనే ఏదో ఒకటి చేసి కనుక్కుంటానని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.