విజయ్ దేవరకొండ వల్లనే 'అర్జున్ రెడ్డి'లో చేసే ఛాన్స్ వచ్చింది!
on Nov 22, 2022
.webp)
తెలుగు ఇండస్ట్రీలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఒక్కసారిగా కెరటాల్లా వచ్చిపడిన కమెడియన్స్. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాదు విజయ్ దేవరకొండ కూడా వీళ్లకు మిత్రుడే..రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి ఎన్నో మూవీస్ లో నటించారు. వీళ్ళు చేసే పాత్రలన్నీ టపాకాయల్లా పేలుతూ ఉంటాయి. "జాతిరత్నాలు" మూవీ వీళ్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో కనిపించారు. అక్కడ ఎన్నో విషయాలను వివరించారు. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ .. "నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్ లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నాకు చిన్నప్పుడు సినిమాలు చూసే అలవాటు కూడా పెద్దగా లేదు. నాకు పుస్తకాలే ప్రపంచం..పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. కానీ మా ఇంట్లో కల్చరల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. నాకు థియేటర్ అంటే ఇష్టం..ఆ ఇష్టంతో వీధి నాటకాలు వేసే టైంలో అనుకోకుండా తరుణ్ భాస్కర్ టీమ్ లో చేసే అవకాశం వచ్చింది. అలా అతని టీమ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ లో చేసాక తరువాత ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి..
ఇక అదే టైంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి 'అర్జున్ రెడ్డి' సినిమా చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ మూవీలో 'శివ' పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. ఆ మూవీ షూటింగ్ ఐపోయి నా పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నప్పుడు అసలు విషయం తెలిసింది "శివ" పాత్రకు నా కంటే ముందుగా ప్రియదర్శిని అనుకున్నారని" అంటూ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



