సౌమ్యరావు, నేను ఒకరి తర్వాత మరొకర్ని వరసగా కంటాం!
on Nov 22, 2022

'జబర్దస్త్' ఖతర్నాక్ కామెడీ షో మొదట్లో అలాగే ఖతర్నాక్ గా అలరించేది. ఐతే రాను రాను కమెడియన్స్ అందరూ ముదిరిపోయి ఎక్స్ట్రా పంచులు, ఎక్స్ట్రా డైలాగ్స్ వేస్తూ వెకిలిగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన నెగటివ్ కామెంట్స్ కారణంగా మళ్ళీ కాస్త దారిలోకి వచ్చింది ఈ షో. ఈ షోకి సంబంధించి యాంకర్స్, జడ్జెస్ విషయానికి వస్తే మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఆడియన్స్ కి పరీక్ష పెట్టారు నిర్వాహకులు.
చివరికి జబర్దస్త్ కి కొత్త యాంకర్ ని పట్టుకొచ్చారు. తెలుగు, కన్నడ సీరియల్స్ చేసిన సౌమ్య రావుని తీసుకొచ్చారు.. వచ్చి రాని తెలుగుతో అందరినీ ఆడేసుకుంటోంది సౌమ్య. రావడంతోనే హైపర్ ఆదిపై వరస పంచులేసింది.
ఈ వారం కూడా ఆది తన మార్క్ పిచ్చి డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. ఈ షో లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ‘ప్రపంచంలో అందరూ చనిపోయి మీరిద్దరే మిగిలితే ఏం చేస్తారు’ అని జడ్జి కృష్ణ భగవాన్.. హైపర్ ఆది, సౌమ్యని ఉద్దేశించి ఒక కామెడీ ప్రశ్న అడిగారు. దీనికి హైపర్ ఆది.. తామిద్దరం కలిసి ఓ ప్రపంచాన్ని సృష్టిస్తాం అని, వరసగా ఒకరి తర్వాత మరొకరిని కంటాం" అని చెప్పి పిచ్చి కామెడీ చేసాడు. ఇక ఆది డైలాగ్స్ కి ఎలా స్పందించాలో అర్ధంకాక పక్కనే ఉన్న సౌమ్య తలదించుకుని ఒక నవ్వు నవ్వేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



