ఫీలింగ్స్ వస్తున్నాయి.. అబ్బాయి కావాలి నాకు అర్జెంటుగా
on Jul 10, 2025
ఈమధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిల్లో ఎక్కువ క్వాలిటీస్ ని కోరుకుంటున్నారు. బుల్లితెర మీద నటించేవాళ్ళు తాము పెళ్లి చేసుకోబోయే వాళ్ళల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో వాళ్ళు రకరకాల షోస్ లో చెప్తూ వస్తున్నారు. రీసెంట్ గా ఢీ షోలో సుస్మిత, అన్షు వచ్చి వాళ్ళను పెళ్లి చేసుకోబోయే అబ్బాయిల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పారు. సుస్మిత ఐతే "ఉదయాన్నే 4 కి లేచి శుభ్రంగా చన్నీళ్ళ స్నానం చేసి పూజలో కూర్చోవాలి" అంది. "ఏంటి కలిసి కూర్చోవాలా" అంటూ రెజీనా కౌంటర్ వేసింది. దానికి సుస్మిత తెగ సిగ్గుపడిపోయింది. "ఏదేమైనా సాయంత్రం 4 కి అతను ఇంటికి వచ్చేసి నన్ను బయటకు తీసుకెళ్ళాలి." అంది. "అసలు ఇంట్లో ఉండరా మీరు" అంటూ ఆది ఫైర్ అయ్యాడు.
"కాదు నందు అబ్బాయిల క్వాలిటీస్ కావాలని నన్ను కంగారుపెట్టేశావ్. నాకేమో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. మరి అబ్బాయి కావాలి నాకు అర్జెంటుగా పెళ్లి చూపులకు" అనేసరికి అందరూ పడీ పడీ నవ్వేశారు. ఇక అన్షు ఐతే తనకు నందులాంటి అబ్బాయి భర్తగా వస్తే చాలు అని చెప్పింది. "నా వర్క్ నేను చేసుకోవాలి అతని వర్క్ అతను చేసుకోవాలి." అని చెప్పింది. అలా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే ఇద్దరూ బాచిలర్స్ అవుతారు కానీ మొగుడూపెళ్లాలు ఎందుకు అవుతారు అంటూ అది కౌంటర్ వేసాడు. "సింపుల్ గా నందులాగా ఉంటే చాలు. హ్యాండ్సమ్, అండర్ స్టాండింగ్ ఉండాలి" అని చెప్పింది. ఇక నందు ఐతే "అలాంటి మొగుడు నీకు దొరకాలని త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్నా" అన్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
