ఆడపిల్లకు జన్మనిచ్చిన ప్రియాంక-మధు
on Sep 23, 2023

జీ తెలుగులో ప్రసారమైన ‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్‌లో సాకేత్‌గా మధుబాబు బాగా పాపులర్. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’… ఇలా వరుస సీరియల్స్‌తో బుల్లితెర పై బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. వరుస సీరియల్స్ తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి పరిచయమైన మధుబాబు బాగా ఫేమస్ అయ్యాడు.
బుల్లితెర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి మధుబాబు మరో నటి ప్రియాంక నాయుడుని వివాహం చేసుకున్నాడు. ఆమె 'వదినమ్మ' సీరియల్‌లో సిరి క్యారెక్టర్ లో నటించింది. వీళ్లది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. ‘వదినమ్మ’ సీరియల్ తర్వాత ప్రియాంక ‘దీపారాధన’ సీరియల్ లో నటించి మెప్పించింది. ఇక 2021 జనవరిలో ప్రియాంక , మధుబాబును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ప్రియాంక- మధు ఇప్పుడు తల్లితండ్రులయ్యారు. వాళ్లకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఆ విషయాన్ని ప్రియాంక-మధు అనే తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాన్స్ కి ఈ విషయాన్నీ షేర్ చేసారు. వదినమ్మ తర్వాత ప్రియాంక సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చింది అలాగే మధుబాబు కూడా నటనకు దూరమయ్యాడు.
కానీ సోషల్ మీడియా ద్వారా ఈ లవ్ పెయిర్ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తమ అప్ డేట్స్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఈ జంట. ప్రియాంక నాయుడు “టూలెట్” అనే మూవీలో హీరోయిన్ గా నటించింది కానీ ఆ మూవీ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. తరువాత “అనగనగా ఒక దుర్గ” అనే మూవీలో కూడా హీరోయిన్ గా నటించింది కానీ మంచి బ్రేక్ రాకపోయేసరికి మళ్ళీ బుల్లితెర మీద సీరియల్స్ లో నటించడం స్టార్ట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



